జమ్మిచెడులో 15 మందిపై పిచ్చికుక్క దాడి

Jun 23, 2026 - 14:57
 0  2
జమ్మిచెడులో 15 మందిపై పిచ్చికుక్క దాడి

గద్వాలలో 15 రోజుల క్రిందట పిచ్చికుక్క దాడి చేసి 20 మందిని గాయపరచిన ఘటన మరువక ముందే మరోసారి పిచ్చికుక్క దాడి

మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరుతున్న కాలనీవాసులు, మరియు పట్టణ ప్రజలు 

జోగులాంబ గద్వాల్ జిల్లా: గద్వాల్ పట్టణం, జమ్మి చెడు లో (4వ, 5వ,వార్డ్ లో ) 15 మంది పై దాడి చేసి కరిచిన పిచ్చి కుక్క.  గాయపడిన వారిని మహబూబ్ నగర్, గద్వాల ఆసుపత్రి కి తరలింపు. కుక్కను చంపేందుకు కోసం గాలిస్తున్న కాలనీవాసులు.  గద్వాల జిల్లా కేంద్రంలో 15 రోజుల క్రిందట నల్లకుంట, కృష్ణవేణి చౌక్, గంజిపేటలో 20 మందిని పిచ్చికుక్క కరిచిన సంఘటన మరువకముందే మరోసారి ఈ రోజు ఉదయం జమ్మిచెడులో 15 మందిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచిన విషయంలో మున్సిపల్ అధికారులు, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు కాలనీవాసులు పట్టణ ప్రజలు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333