జన గణన అవగాహన కార్యక్రమం
జోగుళాంబ గద్వాల7 మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా జన గణన అనేది దేశ అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన ప్రక్రియ. ప్రజల సంఖ్య విద్య ఉపాధి నివాస పరిస్థితి వంటి వివరాలను సేకరించడం ద్వారా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు సమర్థవంతంగా అమలు చేయగలరు. ఈ లక్ష్యంతో 2027 జనగణన అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జనగణన యొక్క ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం. ప్రతి కుటుంబం సరైన సమాచారాన్ని అందించడం వల్ల ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరుతాయని తెలియజేశారు. జనగణ సమయంలో ప్రజలు సహకరించాల్సిన విధానాన్ని ఇంటింటికి వచ్చే సిబ్బందికి సరైన సమాచారం ఇవ్వాలని అలాగే జనగణన ద్వారా దేశాభివృద్ధికి ప్రతిపరుడు భాగస్వామి కావాలని చెప్పారు. గద్వాల పట్టణంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రెవిన్యూ డిప్యూటీ తాసిల్దార్ అజిత్ కుమార్, అలాగే పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు, విద్యాశాఖ ఉద్యోగులు రేషన్ డీలర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.