జనసేన పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం
జనసేన పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ వార్త వెంకటాపురం మార్చి 14:- జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని డాక్టర్ జయసింహ ఇంటి ఆవరణలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జెండా ఆవిష్కరణ అనంతరం డాక్టర్ జయసింహ మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన జనసేన పార్టీ పూర్తిస్థాయిలో వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని తెలిపారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జనసేన పార్టీలో రూ 400 రూపాయలు సభ్యత్వం తీసుకోవడం ద్వారా సహజ మరణాలకు రూ.లక్ష రూపాయలతో పాటు అనుకోకుండా జరిగే ప్రమాదాలకు రూ 5 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా జనసేన పార్టీ ద్వారా చెల్లించడం జరుగుతుందన్నారు. పేద ప్రజల పక్షాన పోరాడే పార్టీ జనసేన మాత్రమేనని ఆయన తెలిపారు. జనసేన పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన జెండా ఎగరవేసి పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ప్రతి జనసేన కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయసింహ తో పాటు సాయి మెస్ రంజిత్, గిన్నెల వెంకట్రావు, తన్నీరు శ్రీనివాసరావు మేస్త్రి, సూరవేడు ఎడ్ల సంపత్ కుమార్, ఆలుబాకకు చెందిన జి. రాజేష్, బేతంచెర్ల బ్రదర్స్, చాకలి ముత్యం, తదితరులు పాల్గొన్నారు.