గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన మాజీ ఎంపీపీ జె.విజయ్ కుమార్ గారు
జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం: చిన్నోనిపల్లి ఆర్ & ఆర్ సెంటర్‌లో గద్వాల శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోరెడ్డి గారి ఆదేశాల మేరకు(MGNREGS) పథకం కింద రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనం మరియు మహిళా సమైక్య భవన నిర్మాణాలకు గట్టు మాజీ ఎంపీపీ జె.విజయ్ కుమార్ స్థానిక సర్పంచ్ దేవేందర్ తో కలిసి భూమిపూజ చేశారు.
✨ఈ సందర్భంగా జె. విజయ్ కుమార్ మాట్లాడుతూ
ఇప్పుడే కొత్తగా ఏర్పాటు చేసుకున్న R అండ్R సెంటర్లో గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో గ్రామపంచాయతీ భవనం మహిళా సమాఖ్య భవనాలు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ భవనం నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి వస్తాయని ఏ అధికారి గ్రామానికి వచ్చిన ప్రజలను కలవడానికి మరియు సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం నుంచి వచ్చే పలు సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను గ్రామపంచాయతీల ద్వారా అందించడానికి వీలవుతుందన్నారు వెంటనే ఈ భవనాల నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
????-ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామ సర్పంచ్ ఉప్పరి దేవేందర్ వార్డ్ మెంబర్లు,ఎల్ బసిరెడ్డి , కురువ నరసింహులు,యు శ్రీనివాసులు,రామచంద్ర గౌడ్,యు తిమ్మప్ప, నరసింహారెడ్డి,బి తిమ్మప్ప దాసరి బజారి వెంకన్న గౌడ్,డీలర్ వెంకటేష్, ధర్మారెడ్డి ,రంగన్న, హనుమన్న, శివరాముడు వీరన్న,పాగుంట నరసింహారెడ్డి,హనుమంతు గోవిందు చాగదోన, పరమేశ్వరయ్య,తిరుమల గౌడ్,శివప్ప,ఉప సర్పంచ్ రంగన్న,గురన్న,డ్రైవర్ మధు,ప్రజలు పాల్గొని నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తికావాలని ఆకాంక్షించారు.