కాంగ్రెస్ పార్టీతోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి, తమ సంక్షేమం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరావత్ వీరన్న నాయక్
చివ్వెంల: కాంగ్రెస్ పార్టీతోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ధరావత్ వీరన్న నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోనీ మజీద్ లో రంజాన్ పండుగ సందర్భంగా తన స్వంత ఖర్చులతో మహిళలాలకు తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నర్సయ్యల సూచనలతో ముస్లిం సోదరులకు తోఫాను అందజేసినట్లు తెలిపారు. ముస్లిం సోదరులందరూ కాంగ్రెస్ పార్టీకి అన్నివేళ అండగా నిలవాలని కోరారు. అనంతరం మండలంలోని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు జాఫర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నంద్యాల సోమిరెడ్డి, కొణతం అప్పిరెడ్డి, నాగు నాయక్, వెన్న మధుకర్ రెడ్డి, వేముల చిన్న, కందుల నర్సిరెడ్డి, గొప్పని అనిల్, గుడ్డు జానీ, మైనార్టీ నాయకులు పటాన్ రంజాన్, ఎండి చాంద్, ఎస్ కె సుభాని, జానీ పాషా, మునీర్, దావత్ పాషా, ఇసుఫ్, మైనార్టీ మహిళ తదితరులు పాల్గొన్నారు.