ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక ఢీ సెల్టింగ్ వ్యవస్థ రద్దు చేయాలి

Mar 17, 2026 - 19:10
Mar 17, 2026 - 19:11
 0  1
ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక ఢీ సెల్టింగ్ వ్యవస్థ రద్దు చేయాలి

ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక ఢీ సెల్టింగ్ వ్యవస్థ రద్దు చేయాలి

జిఎస్పి జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్

ఉపాధి కోల్పోతున్న ఆదివాసులు ప్రజలు...

కొమరం భీం ఆదర్శంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం...

తెలంగాణ వార్త మార్చి 17 : ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక ఢీ సెల్టింగ్ వ్యవస్థ రద్దు చేయాలనీ గొండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ డిమాండ్ చేశారు.మంగళవారం ఎదురు గుట్టల సమీపంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య నాయకుల సమావేశంలో చర్ల మండల వర్కింగ్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ పాల్గొని మాట్లాడుతూ.ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల,వెంకటాపురం మండలాల పరిధిలోని ఏజెన్సీ గ్రామాలైన సుబ్బంపేట,యకన్నగూడెం,ఎదిర,సూరవీడు,కొండాపురం, ఆలుబాక,రామచంద్రపురం తదితర ఆదివాసీ గ్రామాలకు,ఢీ సెల్టింగ్ విధానాన్ని తీసుకు రావడం వల్ల ఆదివాసీ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇసుక ఢీ సెల్టింగ్ విధానం వల్ల,తీరా ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలకు భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బ దెబ్బతింటాయని అన్నారు.ఇసుక కొత్త పాలసి విధానం వల్ల ఆదివాసులకు ఎలాంటి ఉపాధి ఉండదని,5వ షెడ్యూల్డు ఏజెన్సీ ప్రాంతంలో పేసా చట్టానికి అనుగుణంగా ప్రభుత్వం విధి విధానాలు ఉండాలని,ఇసుక ఢీ సెల్టింగ్ కొత్త పాలసీ రద్దు చేసి,ఇసుక పాత విధానాలను కొనగించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆదివాసీ ప్రజలను ఏకమం చేసి మరో కొమరం భీం ఆదర్శంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బుగ్గ అరుణ్,పూనెం రవి కిరణ్,కోరం బన్నీ,బుగ్గ అశోక్,తదితరులు పాల్గొన్నారు

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్