అధికారులు ఇప్పటికైనా స్పందించండి

Sep 28, 2024 - 14:46
Sep 28, 2024 - 17:24
 0  67
అధికారులు ఇప్పటికైనా స్పందించండి

అధికారులు ఇప్పటికైనా స్పందించండి.... గుండె పంగు వెంకటేశ్వర్లు........ మునగాల మండలం కోదండరామపురం గ్రామం లో ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం వలన పలు ఇండ్లు గోడలు నాని వర్షానికి కురిసి ఇంటి పైకప్పు కుంగి కూలే పరిస్థితికి వచ్చాయని గ్రామ ప్రజలు వాపోయారు వివరాల్లోకి వెళ్తే గుండె పంగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వలనకోదండ రామాపురం గ్రామంలో ఎస్సీ కాలనీ లో పలు ఇల్లు తడిసి నాని ఇంటిపై కప్పు కుంగి ఇల్లు కూలే స్థితికి వచ్చినాయి అని ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకొని ఇండ్లలో నివసిస్తున్నామని పూరి ఇల్లు పెంకుటిల్లు రేకు లిల్లు పూర్తిగా కురిసి కుంగి కూలే పరిస్థితికి వచ్చాయని పలువురు నా దృష్టికి తీసుకొచ్చారని అలాగే మా ఇల్లు కూడా కూలే పరిస్థితికి వచ్చిందని ప్రభుత్వం మా గ్రామాన్ని శిధిల వ్యవస్థకు వచ్చినటువంటి మాఇల్లుల కి అధికారులు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని మీడియా ముఖంగా ఆయన కోరారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State