డిసెంబర్ 1న సింహ గర్జన ను విజయవంతం చేయాలి
మా మాల ఎమ్మెల్యేలపై విషం కక్కితే ఊరుకునేది లేదు
సింహగర్జన సభతో మాలల సత్తాను చూపెడుతాం
డిసెంబర్ 1న సింహగర్జన సభను విజయవంతం చేయాలి
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెన్నయ్య
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల అస్థిత్వం కోసం మేం పోరాడుతుంటే మా మాల ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకటస్వామి, సుధాకర్లపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తో పాటు పలువురు విషం కక్కుతున్నారని మా ఎమ్మెల్యేల జోలికి వస్తే సహించేది లేదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ గండమల్ల చెన్నయ్య హెచ్చరించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై మేం పోరాడుతున్నామని డిసెంబర్ 1న హైద్రాబాద్ జింకన గ్రౌండ్స్లో 20లక్షల మందితో భారీ సింహగర్జన సభను నిర్వహించి ప్రభుత్వానికి మా సత్తా చూపెడుతామన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను సమయత్తం చేయాల్సిన అవసరముందని జిల్లాల్లో త్వరలో ముఖ్య కార్యకర్తలతో చైతన్య సదస్సులు నిర్వహించి అన్ని మాల సంఘాలను ఏకతాటిపైకి తెస్తామన్నారు. ఈ నెల 23న నల్లగొండ జిల్లా కేంద్రంలో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంతో పాటు డిసెంబర్ 1న హైద్రాబాద్లో నిర్వహించే సింహగర్జన సభకు 29రాష్ట్రాల నుంచి ప్రజలు తరలిరానున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాలలు అధిక సంక్యలో ఈ సింహగర్జన సభకు తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో-చైర్మన్, సూర్యాపేట జిల్లా ఇంచార్జిగా మేక వెంకన్న, రాష్ట్ర కో-చైర్మన్, నల్లగొండ జిల్లా ఇంచార్జిగా తాళ్ళపల్లి రవి, భూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేష్ ల తో పాటు సూర్యాపేట జిల్లా కోచైర్మన్ గా చందాదాసు, మద్దూరి కుమార్, జిల్లా అధ్యక్షులుగా వల్లమల్ల ప్రకాష్, మహిళా కో-కన్వీనర్గా గాజుల రాంబాయమ్మలను నియమిస్తూ నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇంచార్జి నాగటి జోసఫ్, నాయకులు బొల్లెద్దు మహేందర్, దాసరి కోటయ్య, కళావతి, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.