44వ వార్డులో  ప్రజా పాలన -  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం

Mar 7, 2026 - 13:38
 0  2
44వ వార్డులో  ప్రజా పాలన -  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం

స్వయంగా కాలువలు శుభ్రం చేసిన కౌన్సిలర్ గుణగంటి హేమా సతీష్.

సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 44వ వార్డులో కౌన్సిలర్ గునుగంటి హేమా సతీష్ పర్యవేక్షణలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుభ్రత కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో  మొదటిరోజు మున్సిపల్ సిబ్బందితో కలిసి 44 వార్డులో కాలువలు శుభ్రం చేసే పనులను చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గునుగంటి హేమా సతీష్ స్వయంగా కాలువలు శుభ్రం చేసి ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాల్వలు శుభ్రంగా ఉండి నీరు నిలవకుండా ఉంటే దోమల నివారణ సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు గునుగంటి సతీష్, వార్డు ముఖ్యులు బంధు వీరయ్య, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333