సామాజిక భద్రత అందరి బాధ్యత.
కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా భద్రతా అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సూర్యాపేట రూరల్ పోలీస్.
- సామాజిక భద్రత అందరి బాధ్యత.
- యువత, విద్యార్థులు స్వియనియంత్రణ కలిగి ఉండాలి.
- సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి.
- చిన్న వయస్సులో ప్రేమ ఆకర్షణలకు లోనై భవిష్యత్తును కోల్పోవద్దు.
... కె.నరసింహ ( K Narasimha SP) ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి చందన నర్సింగ్ విద్యాసంస్థల నందు భద్రతా అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హాజరై విద్యార్థులకు స్వీయ నియంత్రణ, సామాజిక మాధ్యమాల ద్వారా కలిగే నష్టాలు, రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల నిర్మూలన, మహిళలు, విద్యార్థుల భద్రత, డ్రగ్స్ మత్తు పదార్థాల నిర్మూలన భద్రతా అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని, ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదువుకోవాలని కళలను సాకారం చేసుకోవాలి, తల్లిదండ్రులకు విద్యాసంస్థలకు మంచి పేరు తేవాలని అన్నారు. ఆకతాయిలు చెప్పే మాటలు, చేష్టలను నమ్మి ప్రేమాకర్షణలకు లోనై బంగారు భవిష్యత్తును కోల్పోకూడదు సూచించారు. సామాజిక భద్రతకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని కోరారు. ప్రస్తుత సమాజంలో రోడ్డు ప్రమాదాల ద్వారా అధికంగా పౌరులు మరణిస్తున్నారని, అనారోగ్యంతోనో, దేశ రక్షణలోనో మరణించే వారి సంఖ్య కన్నా ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు అన్నారు. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడానికి రోడ్డు నియమాల పట్ల, రోడ్డు వినియోగం పట్ల అవగాహన ముందు జాగ్రత్తలే ప్రధాన ఆయుధాలని తెలిపారు. రోడ్డు వినియోగించే సమయంలో చుట్టూ ఉన్న ప్రమాదాలు, అడ్డంకులు గమనించి ముందుకు సాగాలి. రోడ్డు ప్రయాణ సమయంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, కారులు పెద్ద వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. హెల్మెట్ పెట్టుకోవడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మరణాలను తగ్గించవచ్చని అన్నారు.
ప్రస్తుత సమాజంలో సైబర్ మోసాలు పెనుముప్పులా మారాయని అపరిచితులకు వ్యక్తిగత సమాచారం పంచుకోవడం వల్ల సైబర్ మోసాలకు గురై ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఎవరైనా పరిచయమైతే వారికి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకూడదని తెలిపారు. వ్యక్తిగత సమాచారం దొంగిలించి ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడతారని అన్నారు. కావున అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగత ఫోటోలను బ్యాంకు ఖాతా వివరాలను పంచుకోవద్దని తెలిపారు. సోషల్ మీడియా వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.
యువత పౌరులు డ్రగ్స్ మత్తుకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆరోగ్యాలు కోల్పోతున్నారని అన్నారు. డ్రగ్స్ మత్తులో నేరాలు సైతం చేస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ ను మన సమాజం నుండి తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని దీనికి సంబంధించిన సమాచారం పోలీసువారికి అందియాలని విజ్ఞప్తి చేశారు. మహిళల భద్రత పిల్లల భద్రతలో పోలీస్ శాఖ అత్యంత అక్రమంగా ఉందని వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసు వారికి అందించాలని ఫిర్యాదు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం నందు సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్ సూర్యపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ స్థానిక ఎస్సై బాలు నాయక్ చందన విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు.