మ్యాజిక్ డ్రైన్ నిర్మాణాల పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి
కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట 12 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- మ్యాజిక్ డ్రైన్ నిర్మాణాలపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టరేట్ వి సి హాల్ నందు ఉపాధి హామీ పథకం పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేయుత పెన్షన్లలో ఫేస్ అథెంటికేషన్ త్వరగా పూర్తిచేయాలని పెన్షన్లలో అర్హులు, అనర్హుల జాబితా రిజిస్టర్లు తప్పక నిర్వహించాలని, ఎంపీడీవో లాగిన్ లో ఉన్న పెండింగ్ వాటికి అప్రూవల్ ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి అన్నింటికి మరుగుదొడ్లు పూర్తి చేయాలని అలాగే కొత్తగా నిర్మించుకున్న ఇండ్లకు కూడా మరుగుదొడ్లు మంజూరు చేయాలని, గ్రామ పంచాయతీల దగ్గర ఉన్న వాటికి సామూహిక మరుగుదొడ్లు పూర్తి చేయాలని రానున్న వర్షాల దృష్ట డ్రైనేజ్, ఇంకుడు గుంతలు పూర్తి చేయాలని రాబోవు వన మహోత్సవం సందర్భంగా చెట్లు నాటడానికి స్థలాలను గుర్తించి గుంతలు తీయించాలని, పండ్ల
తోటలు మునగ తోటలు పెంచు లబ్ధిదారులను గుర్తించి వారికి ఉపాధి హామీ కింద లబ్ధి చేకూరేలా చేయాలని ఉపాధి హామీ మెటీరియల్ ప్రభుత్వం నుండి విడుదలైన నిధులను పూర్తి అయిన పనులకు చెల్లింపులు చేసి నిధులు వినియోగించుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పి డి సన్యాసయ్య, జడ్పి సి ఇ ఓ శిరీష, డీపీఓ యాదగిరి, అడిషనల్ డిఆర్డిఓ చంద్రశేఖర్, సురేష్,తదితరులు పాల్గొన్నారు.