మాదిగ ఉపకులాల విద్యార్థినీ విద్యార్థులు విద్యలో ఉద్యోగాలలో ముందుండాలి
-బిర్రు మహేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇంచార్జ్
అడ్డగూడూరు 12 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– మాదిగ మాదిగ ఉపకులాల విద్యార్థినీ విద్యార్థులు విద్యలో ముందుండాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జి బిర్రు మహేందర్ మాదిగ.పిలుపునిచ్చినారు యాదాద్రి భువనగిరి జిల్లా లోని అడ్డగూడూరు మండలం రేపాక డి గ్రామంలో ఎస్సీ వర్గీకరణ ఫలాలను అందుకోవడంలో మాదిగ విద్యార్థిని విద్యార్థులు విద్యలో ముందుండాలని ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షులు సూరారం రాజు మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విద్య ఉద్యోగ ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ జండా గద్దెల నిర్మాణంపై అవగాహన సదస్సు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ మహేందర్ మాదిగ హాజరై మాట్లాడుతూ మాదిగ మాదిగ ఉపకులాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను విద్యలో ముందుండే విధంగా చర్యలు చేపట్టాలని అందుకు అనుగుణంగా ఎంతటి అడ్డంకులు ఎదురైనా సరే అధిగమించి పిల్లలను మాత్రం ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండకుండా బడిబాట పట్టే విధంగా వారి ప్రయత్నాలు కొనసాగాలని లేని ఎడల రాష్ట్రంలో దేశంలో మూడు దశాబ్దాలుగా పైబడి ఎస్సీ జాబితాలోని 59 కులాలకు సామాజిక న్యాయాన్ని సాధించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చేసిన కృషి ఫలితం వ్యర్థమవుతుందని ఆయన తెలియజేసినారు అలా వ్యర్థం కాకుండా సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ ఫలాలను మాదిగ మాదిగ ఉపకులాల విద్యార్థిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలంటే అది కేవలం ఒక విద్యతోనే సాధ్యమవుతుందని అందుకు అనుగుణంగా విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పట్టుదలతో పిల్లలను సక్రమంగా బడికి పోయే విధంగా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చినారు.
జూలై ఏడవ తేదీన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించిన 32వ సంవత్సరాల సందర్భంగా జిల్లాలోని ప్రతి మాదిగ పల్లెలో మాదిగ ఉపకులాల పల్లెలో దిమ్మలు లేని గ్రామాలను గుర్తించి ఎమ్మార్పీఎస్ జండా దిమ్మలను ఏర్పాటు చేసి ఒక పండగ వాతావరణంలో ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాల సంబరాలను సంబరాలను చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చినారు కార్యక్రమానంతరం ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ వేయడం జరిగింది.ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా చిప్పలపల్లి మధుసూదన్ మాదిగ అధికార ప్రతినిధిగా సూరారపు బాబు కుమార్ మాదిగ ప్రధాన కార్యదర్శిగా మచ్చ గిరి మాదిగ ఉపాధ్యక్షులుగా సూరారం మచ్చగిరి మాదిగ కార్యదర్శిగా చిప్పలపల్లి నవీన్ కుమార్ మాదిగ తదితరులను నూతన గ్రామ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్ మాదిగ చిప్పలపల్లి శ్రీనివాస్ పాపయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ మాజీ గ్రామశాఖ అధ్యక్షులు చిప్పలపల్లి సైదులు మాదిగ సూరారం నవీన్ కుమార్ మాదిగ ముక్కెర్ల సైదులు మాదిగ సూరారం జాను మాదిగ గ్యార స్వామి మాదిగ గ్యార బిక్షం మాదిగ సూరారం మత్స్యగిరి మాదిగ తదితరులు విద్యార్థులు కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.