మాజీ ఎంపీపీ, జడ్పిటిసి పిలుపుమేరకు కబడ్డీ పోటీలను ప్రారంభించిన బిరం హర్షవర్ధన్ రెడ్డి.
18-03-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం : చిన్నంబావి మండలంలో బిఆర్ఎస్ శ్రేణుల సహకారంతో కబడ్డీ పోటీలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. చిన్నంబావి మండల కేంద్రంలో ఉగాది పండగ సందర్భంగా నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు ముఖ్య అతిథిగా హాజరై కబడ్డీ పోటీలను ప్రారంభించారు.
ఈ పోటీలలో హర్షవర్ధన్ రెడ్డితోపాటు, మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జెడ్పిటిసి వెంకట రమణమ్మ, మాజీ వైస్ ఎంపీపీ పుష్పలత, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, గజ్జి ఈదన్నాతో పాటు చిన్నంబావి మండలం బిఆర్ఎస్ నాయకులు క్రీడలను ప్రారంభించారు.
ముందుగా బీరం హర్షవర్ధన్ రెడ్డి టాస్ ఎగరవేసి క్రీడాకారులతో కరాచరణం చేస్తూ పోటీలను ప్రారంభించరు.
కబడ్డీ పోటీలను ఆసక్తిగా తిలకించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.
గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు
ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ గ్రామాల సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.