పోలీస్ స్టేషన్‌ పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలి

: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు,

Jun 12, 2026 - 20:54
 0  2
 పోలీస్ స్టేషన్‌ పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలి
 పోలీస్ స్టేషన్‌ పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలి

జోగులాంబ గద్వాల12 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వచ్చే డయల్-100 కాల్స్‌కు తక్షణమే స్పందించాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్., సూచించారు. శుక్రవారం అలంపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన ఆయన స్టేషన్ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా స్టేషన్‌లోని రిసెప్షన్, రైటర్ సెక్షన్, టెక్ టీమ్, ఎస్‌హెచ్‌వో కార్యాలయం, లాక్‌అప్ గది, విశ్రాంతి గదులు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేసిన ఎస్పీ, సిబ్బంది యూనిఫాం నిర్వహణతో పాటు జనరల్ డైరీ, బీట్ డ్యూటీ బుక్స్, ఉన్నతాధికారుల సందర్శన రికార్డులు తదితర పత్రాలను పరిశీలించారు.

అనంతరం సిబ్బందితో సమావేశమైన ఎస్పీ గారు, పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, బీట్ వ్యవస్థ, బ్లూ కోల్ట్స్ మరియు పెట్రోల్ వాహనాల విధుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తూ సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు.

డయల్-100 కాల్ అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యలను పరిష్కరించడంతో పాటు, ప్రజా ఫిర్యాదులపై ఎటువంటి జాప్యం లేకుండా స్పందించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు.

ఈ తనిఖీలో గద్వాల డిఎస్పి వై మొగిలయ్య, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి. ప్రదీప్ కుమార్, ఎస్సై ఎం. రామకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333