నూతన కమిషనర్ ను కలిసిన టీయుడబ్ల్యూజే నేతలు
హైదరాబాద్ 28 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన జి.ముకుందరెడ్డిని, ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో రాష్ట్ర బాధ్యులు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని విరాహత్ కోరారు. కమిషనర్ ను కలిసిన వారిలో టీయుడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డిలు ఉన్నారు.