నూతన ఎస్సైగా మల్లేష్ బాధ్యతలు స్వీకరణ
జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షించడానికి కృషి చేస్తానని నూతన ఎస్సై మల్లేష్ తెలిపారు.జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండల నూతన ఎస్సై గా మల్లేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.గద్వాల్ జిల్లా వీఆర్ లో పనిచేస్తూ అయిజకు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎస్సై గా పనిచేస్తున్న ఎస్సై శ్రీనివాస్ గద్వాల్ సీసీఎస్ కు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న ఎస్సై శ్రీనివాస్ ను పోలీస్ సిబ్బంది ఘనంగా సత్కరించారు.నూతన ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన మల్లేష్ మాట్లాడుతూ...మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షించడానికి కృషి చేస్తానని, శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీసు స్టేషన్ లో సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై కు పోలీసు సిబ్బంది ఘనంగా సత్కరించారు.