జిల్లా ప్రజలకు రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ శుభాకాంక్షలు తెలిపిన
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
జిల్లా ప్రజలకు రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దాన ధర్మాల (జకాత్) ద్వారా ఈ పవిత్ర మాసం సహనాన్ని, సేవాభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. రంజాన్ పండుగ శాంతి, సౌహార్ద్రం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఆనందంగా, మత సామరస్యంతో ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. సమాజంలో ప్రేమ, పరస్పర గౌరవం మరింత బలపడాలని, అందరికీ ఆరోగ్యం, సంతోషం కలగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.