జడ్.పి.ఎస్. వెంకటాపురం పాఠశాల యందు పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

Mar 11, 2026 - 11:16
Mar 11, 2026 - 14:46
 0  3
జడ్.పి.ఎస్. వెంకటాపురం పాఠశాల యందు పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

*జడ్.పి.ఎస్. వెంకటాపురం పాఠశాల యందు పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం*

తెలంగాణ వార్త వెంకటాపురం : జడ్.పి.ఎస్. వెంకటాపురం పాఠశాల యందు పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయబడినది. ఈ సమావేశానికి ఏఏపిసి చైర్మన్ స్వరూప రాణి  మరియు వెంకటాపురం మండల్ గ్రామపంచాయతీ సర్పంచి సరస్వతి  ఉప సర్పంచ్ సునీల్  విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన గుడిమెట్ల లిఖితకి శ్రీదేవి  5000 రూపాయలు నగదు బహుమతిని వారి తండ్రిగారైన రమేష్ కి అందజేయడం జరిగింది .ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ సంవత్సరం గత సంవత్సరం 10వ తరగతి మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలని మీ తల్లిదండ్రులకి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరడం జరిగింది . తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చక్కటి పాటలకు డాన్సులు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్