ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరుగుదల
ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరుగుదల
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జరిగిన ఒప్పందం మేరకు 11 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణను ప్రభుత్వం ఖరారు చేసింది. 2021 ఏప్రిల్ 1 నుంచి వేతన వసరణ అమలులోకి రానుంది. దీంతో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులతో పాటుగా 2021 ఏప్రిల్ 1 నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది అమలుకానుంది. ఈ నిర్ణయంతో సంస్థ పైన రూ.2400 కోట్ల పైగా భారం పడుతుంనుందని సమాచరం. ఈ నిర్ణయంతో కండక్టర్లకు రూ.4,000 - 15,000 వరకు, డ్రైవర్లకు రూ.4,000 - 17,000 వరకు నెలవారీ వేతనం పెరిగే అవకాశం ఉందని అంచనా.