అమ్మ ఒడి నుంచి అదృశ్యమై నాలుగు నెలలైనా లభ్యం కానీ చిన్నారి ఆచూకీ
భద్రాద్రి కొత్తగూడెం - పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన వానరాసి జంపన్న, దుర్గ దంపతులు బతుకుదెరువు కోసం సత్తుపల్లికి వలస వచ్చారు..
జంపన్న గ్యాస్ పొయ్యిలు మరమ్మతులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మే 20న అర్ధరాత్రి తల్లిఒడిలో నిద్రిస్తున్న 11 నెలల సాయి దేవాన్ష్ అదృశ్యం అయ్యాడు.
ఇప్పటి వరకు అతడి జాడ దొరకలేదు..
నాలుగు నెలలైనా చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. బిడ్డ ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడోనని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు