అద్వాన్నపు రోడ్లపై ఎన్నాళ్లీ నరకయాతన?

Jun 12, 2026 - 00:11
Jun 12, 2026 - 00:50
 0  0
అద్వాన్నపు రోడ్లపై ఎన్నాళ్లీ నరకయాతన?

సూర్యాపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.

నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి.
     - ఎర్ర అఖిల్ కుమార్ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు.

సూర్యాపేట 12 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనుల నిర్లక్ష్యం వలన చిన్న వర్షానికే బురద అయ్యి ప్రమాదాలు జరుగుతున్నాయని సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర అఖిల్ కుమార్ అన్నారు. సూర్యాపేట మునిసిపాలిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ చేస్తున్న పాదయాత్రలో భాగంగా ఈరోజు 46వ వార్డులో పర్యటించి రోడ్లను, మురుగు కాలువలను పరిశీలించటం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వలన, ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి ఈగలు దోమలు పాములు క్రిమి కీటకాలకు  వీధులన్నీ నిలయమైనాయని ఆవేదన చెందారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల నిర్లక్ష్యం వలన రోడ్ల పైన నడుస్తున్న పాదచారులు, వృద్ధులు,పిల్లలు కూడా అతుకుల గతుకుల రోడ్ల వలన కింద పడిపోయి కాళ్లు చేతులు విరగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. మొన్న కురిసిన చిన్న వర్షానికే రోడ్లన్నీ బురద మయం అయ్యి నడిచే పరిస్థితి లేదన్నారు.

త్వరలో పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న వేళ జరగబోయే ప్రమాదాలను తలచుకుంటే ఎంతో ఆవేదన కలుగుతుందని అన్నారు. అందుకని అన్ని వార్డులలోని డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించి, రోడ్లన్నీ యుద్ధ ప్రాతిపదికన సిమెంట్ రోడ్లుగా నిర్మించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.చేసే పనులలో కూడా నాణ్యత లేదన్నారు. వీటిపై అధికారులు విచారణ చేసి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా పట్టణంలో నీటి సమస్య వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.వెంటనే కమిషనర్ గారు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలి అన్నారు. లేనియెడల రాబోయే రోజులలో ప్రజల నుండి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
      ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక,ఎఐపికెఎంఎస్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పేర్ల నాగయ్య, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు మారసానీ చంద్రకళ, జిల్లా కమిటీ సభ్యులు కట్ట కల్పన, ఐతారాజు పద్మ, భీమనపల్లి పద్మ, కొత్తపల్లి వేణు,పజ్జూరి రేణుక తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333