ప్రభుత్వ పథకాలను ప్రారంభించిన ముత్తిలేని వీరయ్య తూములసురేష్ రావు*

Jan 26, 2025 - 19:42
Jan 26, 2025 - 19:50
 0  31
ప్రభుత్వ పథకాలను ప్రారంభించిన ముత్తిలేని వీరయ్య తూములసురేష్ రావు*

ప్రభుత్వ పథకాలను ప్రారంభించిన ముత్తిలేని వీరయ్య తూములసురేష్ రావు

తెలంగాణ వార్త జనవరి 26 పెన్ పహాడ్ మండలం పరిధి దుబ్బ తండాలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మూతిలేని వీరయ్య రైతు భరోసా ,ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులను, ఘనంగా ప్రారంభించారు* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఈ గ్రామంలో పూర్తిగా సాచురేషన్ పద్ధతిలో ఈ పథకాలను అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు ఆనందంతో స్వేచ్ఛ వాయువులను ఆస్వాదిస్తూ ఆర్థికంగా, సామాజికంగా, ఆత్మ గౌరవంతో ముందుకు పోవడానికి అడుగులు వేస్తున్నారన్నారు భూమి లేని పేదలకు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12000 అందించడం ప్రతి రైతుకు మద్దతుగా ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 అందించడం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడం దారిద్ర రేఖకు దిగువున ఉన్న పేద కుటుంబాలన్నింటికీ ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో కొత్త రేషన్ కార్డు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇవ్వటం కోసం ఈ పథకాలను ప్రారంభిస్తున్నాం అన్నారు ,దీని ద్వారానే గ్రామ స్వరాజ్యం మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడమే కాకుండా 500 రూపాయలు బోనస్ ఇచ్చారన్నారు, మన రైతులందరికీ రుణమాఫీ చేస్తాన్న మ న్నారు .రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం లాంటి పథకాలు అమలు చేసి తెలంగాణ ప్రాంతాన్ని రైతు రాజ్యంగా మార్చ పోతున్నామని అన్నారు రైతు భరోసా 140 రేషన్ కార్డులు 43 ఇందిరమ్మ ఇండ్లు 21 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 23 లబ్ధిదారులు గుర్తించారు ఈ కార్యక్రమం లో మండల ప్రత్యేక అధికారి ప్రసాద్, తహసిల్దార్ లాలూ నాయక్, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఏవో అనిల్ కుమార్, ఏపీఓ రవి, పంచాయతీ కార్యదర్శి రజని, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల సురేష్ రావు, పిన్నమనేని కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ భూక్య పద్మ, మాజీ సర్పంచ్ భూక్య కవిత, పిన్నమనేని సందీప్, సందీప్ రాథోడ్, పిన్నమనేని జనార్ధన్, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు..

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State