విజయవంతంగా ముగిసిన బడిబాట కార్యక్రమం.

Jun 12, 2026 - 20:51
 0  1
విజయవంతంగా ముగిసిన బడిబాట కార్యక్రమం.
విజయవంతంగా ముగిసిన బడిబాట కార్యక్రమం.

జోగులాంబ గద్వాల 12 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో.. మే నెల మూడో వారంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించి శుక్రవారంతో బడిబాట కార్యక్రమాన్ని ముగించారు. జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల చేత ర్యాలీతో పోస్టర్ల ద్వారా కరపత్రాలతో ఇంటింటికి తిరిగి బడి ఈడు పిల్లలు బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. విద్యాభాసములో నిరక్షరాస్యత శాతాన్ని తగ్గించేందుకు విద్యాశాఖ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో అనేక కార్యక్రమాల ద్వారా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి మండల స్థాయి. గ్రామ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పర్యవేక్షణ చేసి విద్యాభివృద్ధి కోసం తోడ్పడు అందించారు. ఎక్కడ బడి ఈడు పిల్లలు బడి బయట ఉండకూడదని లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష ఆదేశాల మేరకు అనేక సమ్మర్ క్యాంపు ల ద్వారా నిరక్షరాశులను అక్షరాసులుగా మహిళా సంఘాల్లోని సభ్యులను.18 సంవత్సరాల పైబడిన వారిని ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు నిర్వహించి జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి అభివృద్ధి కోసం పాటుపడ్డారు. బడి బయట కార్యక్రమం ద్వారా జిల్లాలోని సుమారు 2000 మంది విద్యార్థులను బడిలో చేర్పించేందుకు విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్య కమిటీ చైర్మన్ కృషి అభినందనీయమని కొనియాడారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333