యూరియా పై అవగాహన సదస్సు

Apr 28, 2026 - 19:34
Apr 28, 2026 - 20:19
 0  4
యూరియా పై అవగాహన సదస్సు

అడ్డగూడూరు 28 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ళ రామారం రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతు అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రోఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల చే ఈ క్రింది అంశాల పై చర్చించడం జరిగింది.ఈ అవగాహన కార్యక్రమంలో తక్కువ యూరియా వాడకం గురించి సమతుల్య ఎరువుల వినియోగం మైక్రో న్యూట్రియంట్స్ ప్రాముఖ్యత సేంద్రియ పద్ధతులు ఆధునిక సాగు విధానాలు గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డా" ఎన్. ప్రవీణ్  ప్రొఫెసర్,సైంటిస్ట్ ఏఎంసి డైరెక్టర్ సిహెచ్ సోమయ్య,ఏవో పాండు రంగాచారి ,ఏ ఎస్ ఓ ఎస్ అక్షర ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ,రైతులు తదితరులు పాల్గొన్నారు,