ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయాలు

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్.

Jun 15, 2026 - 19:10
 0  4
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయాలు
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సదుపాయాలు

జోగులాంబ గద్వాల 15 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రభుత్వ పాఠశాలలోనూ నిశ్చితులైన ఉపాధ్యాయులు ఉన్నారని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో విద్యాభివృద్ధి కల్పించడం జరుగుతుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష్ షేక్ అన్నారు. సోమవారం కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు అక్కడ ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడి మరి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించి ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉండడంతో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన కమిటీని విద్యార్థులతో ఏర్పాటు చేసి పరిరక్షణ చేయించాలన్నారు. తరగతి గదులతోపాటు పాఠశాల ఆవరణ పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పాఠశాలను విద్యార్థులకు త్రాగునీరు మరుగుదొడ్లు తదితర సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాలని వారు సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ. విద్యార్థి వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సాధిస్తే ఇందులో మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుందని వారు తెలిపారు. గ తేడాది పదో తరగతిలో టాపరు నిలిచిన విద్యార్థుల కంటే ఈ విద్యా సంవత్సరం లో ప్రస్తుత విద్యార్థులు బాగా చదివి ఇంకా ఎక్కువ మార్కులు సాధించాలని వారు కాక్షించారు. సెలవులను ఎలా సద్విని చేసుకున్నారని సమ్మర్ స్పెషల్ తరగతులకు ఎంతమంది హాజరయ్యారని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేయడం జరిగిందని. త్వరలో ఏకరూప దుస్తులు కూడా ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333