పీఠమెక్కిన ప్రతినిధులారా!

Mar 9, 2026 - 05:08
 0  1

పీఠమెక్కిన ప్రతినిధులారా!  

ఇల్లు అలకగానే పండుగ కాదు. చీర సారెలు సామాను  ఎలా సమకూర్చాలో  అట్లే ప్రజా సమస్యల పరిష్కారంలో  వెనుకడుగేస్తే సహించరు.

 ప్రజలే  ప్రభువులని  మీరు సేవకులనీ మరవద్దు. c .M. గారు  అదే సందేశం ఇచ్చారు కదా! 

----వడ్డేపల్లి మల్లేశం 


 గత నెలలో నిర్వహించుకున్న గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు  ఫిబ్రవరి మాసంలో  పూర్తి చేసుకున్న మున్సిపల్ ,  కార్పొరేషన్ల ఎన్నికల పనితీరును గమనించినప్పుడు  పరస్పర విమర్శలు  ఆరోపణలతో పాటు కొన్ని చోట్ల శత్రు కూటములు కూడా మిత్రులైన సందర్భాల మనం గమనించవచ్చు.  ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా  గమనంలోకి తీసుకుంటే ఒకటి  ఏ రెండు పక్షాలు కూడా శాశ్వత శత్రువులు కాదని తెలిస్తే రెండవది  అంతర్గత ప్రయోజనాలు ఏమిటో కానీ  పాలకవర్గ రూపకల్పనలో పరస్పరం చర్చించుకుని  కొంత సజావుగా పూర్తి చేసుకున్న సందర్భాన్ని  అభినందించవలసినదే.  అధికార ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ల సీట్లు ఎన్ని ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థులే కొన్ని చోట్ల చైర్మన్లు, మేయర్ లు అయిన సందర్భాలను గమనించినప్పుడు  కొన్ని అసాధారణ నిర్ణయాలు కూడా జరుగుతాయని అర్థమవుతున్నది.  మరికొన్ని చోట్ల ఊహించని రీతిలో అప్పటికప్పుడు మారిన సమీకరణాల నేపథ్యంలో  పదవులు వరించిన తీరు కూడా గమ్మత్తు గానే ఉంది.  

కొందరు లక్షలు ఖర్చు చేస్తే మరికొందరు ఏ రకంగా నైనా సరే మేయర్  చైర్మన్ పీఠం దక్కించుకోవాలని కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు  సాధించేదాకా తలవంచే ప్రసక్తి లేదని  మొండికేస్తే మరి కొందరు తమకు ఓట్లు ప్రజలు వేయలేదని   ఇచ్చిన చీర సారే లతో పాటు డబ్బును తిరిగి ఇవ్వాలని దాడులు చేసిన సందర్భం కూడా మనం  గమనించవచ్చు. " ఓట్లు వేసేముందు డబ్బులు ఇవ్వకపోతే ఓటర్లు డిమాండ్ చేసిన సందర్భాలు, ఓట్లు పూర్తయిన తర్వాత తమకు ఓటు వేయలేదని భావిస్తే  ఇ చ్చిన సొమ్మును తిరిగి డిమాండ్ చేసినటువంటి అభ్యర్థుల విధానం  గత పది సంవత్సరాలుగా స్పష్టంగా చూడవచ్చు . రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు ప్రతి స్థాయిలోని ఎన్నిక కూడా ఓ మేరకు పారదర్శకంగా విలువలకు కట్టుబడి ఎన్నికల్లో ఓటు వేయడం తమ బాధ్యతగా భావించిన ఓటర్లు  అభ్యర్థుల యొక్క దిగజారుడుతనం కారణంగా  స్వార్థ ప్రయోజనాలకు పాకులాడి ఎలాగైనా అధికారాన్ని చేజి క్కించుకోవడమే పరమావధిగా భావించిన సందర్భంలో ఓటర్లు కూడా అదే స్థాయిలో  డిమాండ్ చేయడం నువ్వా నేనా అన్నట్టు ఉన్నది ". .ఇదంతా ఎన్నికల నోటిఫికేషన్ వెలు వడి షెడ్యూల్ ప్రకారంగా ఓట్లు జరిగి  చైర్మన్లు మేయర్లు ఇతర ప్రతినిధుల ఎన్నికలు సజావుగా ముగిసిన తర్వాత  గత ప్రస్తావన గురించి గానీ ఇటీవల ఎన్నికల నేపథ్యం గానీ  చర్చించుకోవడం కాకుండా  తమను గెలిపించిన ప్రజల యొక్క ప్రజా ఆకాంక్షల నెరవేర్చే క్రమంలో  కౌన్సిలర్లు కార్పొరేటర్  ఇతర ప్రజా ప్రతినిధులు అంతా కూడా పనిచేయవలసి ఉంటుంది . అక్షరాస్యులైన, నిరక్షరాస్యులైన  తమ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో నిబద్ధతగా పని చేయవలసి ఉంటుంది  ఎన్నికల్లో  ధన ప్రవాహం ప్రభావం భారీగా వున్నా ప్రజలు నచ్చని అభ్యర్థులను ఓడించిన సందర్భాలను కూడా గమనించినప్పుడు  కొంత పారదర్శకత ఇప్పటికీ కొనసాగుతుందని అంగీకరించి  తీ రాలి  .


ఇల్లలుకగానే పండుగ కాదు 

కేవలం పదవి బాధ్యతలు స్వీకరించడం అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతోనే సరిపెట్టుకుంటే  ప్రజలు శిక్షిస్తారనే  విషయం అనేక సార్లు  రుజువైనది.  "అందుకే ఇల్లలకగానే పండుగ అయినట్టుగా సంబరపడిపోతే సరిపోదు.  పండుగకు సంబంధించిన సామాగ్రితోపాటు ఆచ రణ ఇంట్లో కనపడాలి కదా!" అలాగే ప్రజాస్వామ్య విలువల పట్ల పరిపాలన అంశాల పట్ల  బాధ్యతతో అవగాహనతో తమ కర్తవ్యాన్ని నిర్వహించడానికి గెలిచిన అభ్యర్థులు ప్రతినిధులు  పునర0 కితం కావడం పైన వెంటనే దృష్టి సారించి వలసిన అవసరం ఉంది. ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తే అయిపోతది అని అనుకుంటే మాత్రం  కుదరదు. ప్రభువులైన ప్రజలే  పాలకుల ను శాసించే రోజు తప్పక వస్తుంది . ఆ ఆలోచన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఏనాడో ప్రజలకు  సూచన చేశారు.  

.ప్రజల అసంతృప్తి మించిపోయిన రోజున,  ప్రజా ఆగ్రహం కట్టలు తెంచుకున్న రోజున , ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం సాచివేత వైఖరి  ప్రజా నిరసన జ్వా లల్లో  మాడి మసి అయి పోతుంది జాగ్రత్త !" స్థానిక సంస్థలతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి, పెత్తందారి వర్గాలకు కొమ్ముకాస్తూ, ప్రజలను బానిసలుగా చూసే ప్రయత్నం చేస్తున్న క్రమములో  ఓటర్లను పా వులుగా వాడుకోవడం తాత్కాలిక ప్రలోభాలకు లొంగిపోవడం  వలన యాచకులుగా మిగిలిపోవడం బాధాకరం.  ఈ సంకేతాన్ని ప్రజలు ఎన్నికల తర్వాత ప్రతినిధుల యొక్క బాధ్యతల నిర్వహణ క్రమంలో తమ శక్తిని సామూహిక చైతన్యాన్ని ప్రదర్శించడం ద్వారా  తమ డిమాండ్లను సాధించుకునే క్రమంలో ఎంత శక్తి మేరకు ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజల యొక్క శక్తిని పాలకులు గుర్తిస్తారు.

భవిష్యత్తులో ప్రజలను బానిసలుగా యాచ కులుగా బలహీనులుగా భావించరు అనే విషయాన్ని ప్రజలుగా పాలకులకు రుజువు చేయాల్సిన అవసరం చాలా ఉన్నది."  స్థానిక సంస్థలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని కూడా  మౌలిక సమస్యల పరిష్కారంలో దృష్టి సారించాలి  నాసిరకం పనులు చేస్తున్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీయాలి, వాటికి సంబంధించిన దాఖలాలను న్యాయస్థానంలో ప్రశ్నించాలి కూడా.  ప్రశ్నించడం ద్వారా చైతన్యాన్ని నింపుకొని కొత్త బాధ్యతల వైపుగా ప్రజలు ఓటర్లు దృష్టి సారించి  ప్రజాప్రతినిధులలో వణుకు పుట్టించాలి.

ఈ మార్పు రానంతకాలం దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. " నిరంతరము గెలిచిన అభ్యర్థులు ప్రజాప్రతినిధులు ప్రజల సమక్షంలో  పర్యటించడం, సమస్యలను సేకరించడం, తాత్కాలిక శాశ్వత పనులను  ఎంపిక చేసుకోవడం, శాసనసభ్యులు మంత్రులు ప్రభుత్వ ప్రతినిధుల సహకారంతో సమస్యల పరిష్కారంలో ప్రజల పక్షాన పని చేయడం ద్వారా ప్రజలకు ఇచ్చిన మాట  నిలబెట్టుకోవాలి. ఏ పార్టీకి చెందిన వారమనీ కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి  ప్రజల ఆకాంక్షలకు అక్షర రూపం ఇవ్వాలి. " ఎన్నికల సందర్భంలో చేసిన ఖర్చును దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలకు సేవకుడిననీ భావించి సమస్యలు పరిష్కరించాలి. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా  నేనే మంత్రి నేనే రాజును అంటే  ప్రజలకు సేవ చేసే సేవకుడ ఆని వివరణ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు కదా.


(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333