దళిత ప్రజాప్రతిని దక్కని గౌరవం

Mar 11, 2026 - 21:02
 0  1
దళిత ప్రజాప్రతిని దక్కని గౌరవం

దళిత ప్రజాప్రతిని దక్కని గౌరవం 

 స్థానిక వార్డ్ మెంబరు నేలపైన సర్పంచ్ కుర్చీలో

 గౌరవం అంటే ఇదేనా

తెలంగాణ వార్త వాజేడు:

 ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామంలో గల పేరూరు అంగన్వాడి సెంటర్ వన్ ను స్థానిక సర్పంచ్ గొడ్డె సరోజినీ దేవి స్థానిక వార్డు మెంబరు అరికిల్ల కౌసల్య సందర్శించగా కేవలం సర్పంచ్ ను మాత్రమే కుర్చీలో కూర్చోబెట్టి వార్డు మెంబర్ను నేలపైన కూర్చోబెట్టారు దళిత ప్రజాప్రతినిధి కాబట్టే ఇలా అగౌరవపరిచారని దళిత సంఘాల నాయకులు మండిపడుతున్నారు గౌరవం అంటే ఇలా ఉంటుందా? ప్రజాప్రతిని ఎవరైనా గౌరవించాల్సిందే కదా అటు సూపర్వైజర్ ఇటు సర్పంచ్ కుర్చీలో కూర్చొని వార్డు మెంబర్ను నేలపైన కూర్చోబెట్టడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత మహిళా ప్రజాప్రతినిధికి దక్కే గౌరవం ఇదేనా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్