గొర్రెల పెంపకందార్ల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో 10వేల కోట్లు కేటాయించాలి
భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి వినతి పత్రం ఇస్తున్న
గొర్రెల మేకల పెంపకం దారులు సంఘం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు గురువారం రోజున భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ తెల్లం వెంకట్రావు ను కలిసి గొర్రెల మేకల పెంపకం సంఘం దారులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇస్తున్న గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు మాట్లాడుతూ గొర్రెల పెంపకందార్ల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో 10వేల కోట్లు కేటాయించాలి.దళారుల ప్రమేయం లేకుండా నగదు బదిలీ ద్వారా రెండవ విడత గొర్రెల పంపిణీ చేయాలని. కర్ణాటక తరహాలో గొర్రెల కాపరులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి.
రెండు లక్షలు నగదు బదిలీ ఏర్పాటు చేయాలి.
గొర్రెలకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేటట్లు చూడాలని.
ప్రతిమూడు నెలలకు ఒకసారి నాణ్యమైన నట్టలమందు ఉచితంగా తాగించాలి.
ప్రతి గ్రామంలో సామూహిక గొర్రెల షెడ్డులు నిర్మాణం చేసి ఇవ్వాలి
జీవాలకు వేసవి కాలంలో నీటి తొట్లు నిర్మించాలి.
సబ్సిడీ మీద జీవాలకు దాణా గడ్డి గింజలు సరపర చేయాలి
ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలి.
50 సంవత్సరాలు దాటిన గొర్రెల కాపరులకు నెలకు 5000 పింఛన్ మంజూరు చేయాలి.
ప్రమాదం ద్వారా చనిపోయిన గొర్రెలకు 10 లక్షల సబ్సిడీ ఇవ్వాలి
వారు సానుకూలంగా స్పందించన. ఎమ్మేల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ గొర్రెల కాపరులను కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్ని రకాలుగా హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొల్లి సత్యనారాయణ,కుమ్మరి కుంట్ల సాంబశివరావు,మొగిలి కనకరాజు,
రసూరి దైవ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.