సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో గాయత్రి నర్సింగ్ హోo 30 వ వార్షికోత్సవ వేడుకలు:
ఘనంగా సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో గాయత్రీ నర్సింగ్ హోమ్ 30వ వార్షికోత్సవ వేడుకలు*
వినాయకుడి చిత్ర పటం తో కూడిన వాచ్ ను బహుకరించిన సాజిద్ ఖాన్*
కన్నతల్లి లాంటి సూర్యాపేటకు వైద్య సేవలు అందించేందుకు కృషి*
ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు సహాయం చేస్తా*
ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్*
సూర్యాపేట: సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో గాయత్రి నర్సింగ్ హోమ్ 30వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం గాయత్రి నర్సింగ్ హోమ్ లో ఘనంగా నిర్వహించారు. సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో వినాయకుడి చిత్రపటం తో కూడిన వాచ్ బహుకరించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభించిన సందర్భంలో నాలుగో పేషెంట్ నని 30 సంవత్సరాలుగా వైద్యులు గా రామ్మూర్తి ప్రజలకు వైద్య సేవలు అందించడం హర్షణీయమని ప్రతి ఏడాది మతసామరస్యానికి ప్రత్యేకగా హిందూ దేవుళ్ళ చిత్రపటాలను బహుకరించి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రజల అభిమానాన్ని చూరగోని నా మీద నమ్మకంతో సూర్యాపేట ప్రజలు ఆదరించటం ఎంతో ఆనందదాయకమని మా స్వగ్రామం కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామం అయినప్పటికీ సూర్యాపేట తనకు కన్నతల్లి లాంటిదని చెప్పారు. ప్రజల సహకారం తో భవిష్యత్తులో కూడా వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ పాఠశాల చదివే పేద విద్యార్థులకు సహాయం చేస్తానని ఎందుకంటే చదువు భవిష్యత్తుకు దిక్సూచి లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊరగాయత్రి, సీనియర్ కాంపౌండర్ లు యాలాద్రి, మల్లేష్, ఆంజనేయులు, వేణు, కిరణ్, మహేష్, నరేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు