స్నేహితుని జ్ఞాపకార్థం అన్నదానం

Aug 4, 2024 - 22:00
Aug 4, 2024 - 22:10
 0  18
స్నేహితుని జ్ఞాపకార్థం అన్నదానం

స్నేహితుని జ్ఞాపకార్థం అన్నదానం చేయడం అభినందనీయం 

 పేట పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట 04 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అకాలంగా తమ నుంచి దూరమైన స్నేహితుని జ్ఞాపకార్ధం తోటి స్నేహితులు అన్నదానం చేయడం అభినందనీయమని సూర్యాపేట పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేనారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక హెడ్ ఫోస్టాఫీసు ఎదుట ప్రధాన రహదారిపై 500ల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన వీర్లపాటి వెంకటేశ్వర్లు అకాలంగా మృతి చెందడంతో ఆయన జ్ఞాపకార్ధం స్నేహితులంతా కలసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.  

 వీర్లపాటి వెంకన్న కల్మషం లేని వ్యక్తి అని అందరితో మంచిగా ఉండే వాడని ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ప్రతి యేటా స్నేహితుల దినోత్సవాన్ని తమంతా కలసి ఎంతో ఘనంగా జరుపుకునేవాళ్లమని నేడు మా మిత్రుడు మా మధ్య లేక పోవడంతో ఆయన జ్ఞాపకార్థంగా ఏదైనా సేవా కార్యక్రమం చేయాలనే తలంపుతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహితులు అబ్దుల్ రహీం, కె.చంద్రశేకర్, అయుబాఖాన్, సోమన్న, మురళీ, రాజేందర్, వేణు, కొక్కు సోమేశ్వర్లతో పాటు మిత్రబృందం పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223