సూర్యాపేట జిల్లాలో పులి ,చిరుత సంచారం అనేది వాస్తవంగా అసత్య ప్రచారం మాత్రమే.

ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో పులి ,చిరుత సంచారం అనేది వాస్తవంగా అసత్య ప్రచారం మాత్రమే.. పైన ఉన్న ఫోటో హైనా అనే తోడేలు జాతికి చెందిన జంతువు ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో సంచరిస్తుంది. దీని వలన మనుషుల కు ఏ ప్రమాదం లేదు.. ఒంటరిగా ఉన్న మేక గొర్రె పిల్లలపై మాత్రమే దాడి చేస్తుంది. గుంపుగా గొర్రెల మంద ఉంటే దానికి భయం ఎక్కువ... చివేంల మండలం బండమీద చందుపట్ల, మోతె మండలం రాఘవాపురం, సిరికొండ , కూడలి గ్రామాలలో ఓ వారం సంచరించి ప్రయాణం చేస్తూ ప్రస్తుతం మద్దిరాల మండలం చిన్న నేమిల తండాలు, మామిల్లమండువ ప్రాంతాల్లో తానంచర్ల ఏటి సమీపాల్లో ఉన్నట్లు సమాచారం..
పులి ,చిరుత గాని సంచరించినట్లయితే వాటికి ఆకలి ఎక్కువ ఆహారం కోసం ఏదో ఒక రోజు ఎక్కడో ఒకచోట గేదెలపై గాని మనుషుల మీద గాని జీవాల మీద గాని దాడి చేసిన దాఖలాలు లేవు .కాబట్టి అది చిరుత లేదా పులి అనడానికి అవకాశాలు లేవు. సూర్యాపేట జిల్లాలో చిరుత లేదా పులులు సంచరించే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. ఫేక్ న్యూస్లతో ప్రజలను భయభ్రాంతులను గురి చేయకూడదు...