సూర్యాపేటను కోనసీమగా మార్చిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి జగదీష్ రెడ్డి

ప్రతినిధి సూర్యాపేట
ఇచ్చిన మాట ప్రకారం చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన సాహసి, తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ అని సూర్యాపేట బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ లో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన సూర్యాపేటను టూరిస్టు సర్కిల్‌గా తీర్చిదిద్దాలని జగదీష్ రెడ్డి చేసిన విజ్ఞప్తి ని కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దేశంలో సామాన్యుడికి అభివృద్ధి ఫలాలు ఎలా చేరాలో పాలనలో చేసి చూపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు.
సూర్యాపేట అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో సహకారము చేశారన్నారు. కరువు నేల అయిన సూర్యాపేటను కాళేశ్వరం జలాలతో సాగు, తాగు నీరు అందించి సమస్యలు లేకుండా చేశారన్నారు. అడిగినన్ని నిధులు అందించి అనేక అభివృద్ధి పనులకు సహకరించారన్నారు. సూర్యాపేటలో యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రైపోర్టు, ఇండస్ట్రియల్ పార్క్ ఐటీ హబ్‌ను విస్తారించాలని కేసీఆర్‌ను కోరగా దానికి కూడా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.