కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు

సర్పంచ్ మామిల్లపల్లి చక్రవర్తి ఆధ్వర్యంలో

కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు

20-11-2023 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన బెక్కెం మియాపూర్ గ్రామాలకు చెందిన పలువురు టిఆర్ఎస్ నేతలు జూపల్లి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరడం జరిగింది.  గూడెం సర్పంచ్ మామిళ్ళపల్లి చక్రవర్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి పలు గ్రామాల ముఖ్య నేతలు కాంగ్రెస్ లోకి వలసలు  చిన్నంబావి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. బెక్కం,మియ్యపుర్ గ్రామాలకు చెంది న పలువురు బీఆర్ఎస్ నాయకులు జూపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక. చిన్నంబావి మండలం బెక్కం,గూడెం గ్రామానికి చెందిన మాజీ సింగల్ విండో డైరెక్టర్ శేఖర్ యాదవ్,మాజీ వార్డు మెంబర్ లు కాంత్తయ్య ,అల్లం రవి,  మియ్యపూర్ గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ బీరం హర్షవర్ధన్ రెడ్డిని నమ్ముకుని పార్టీలో ఉంటే అతను తన దగ్గర ఉన్న కొంతమంది అనుచరులమాటలు విని మమ్ములను పట్టించుకోకుండా తన అనుచరులు ఏమి చెప్తే అది వినుకుంటూ ఈరోజు కొన్ని గ్రామాలను మరియు మాలాంటి కొంతమంది అతని నమ్ముకుని పనిచేసిన వాళ్లకు అతను చేసింది శూన్యం కావున మాకు అతడు వద్దు అని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని అన్నారు...ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిదంబర్ రెడ్డి ,గూడెం సర్పంచ్ మమిళ్ళపల్లి చక్రవర్తి ,తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.