సామాన్యుడికి అందుబాటులోకి 10 కేజీల కాంపోజిట్ డొమెస్టిక్ ఫైబర్ సిలిండర్లు
ఫైబర్ సిలిండర్లతో ఎన్నో ఉపయోగాలు.
సామాన్యుడి సేవలో అంజన్ గ్యాస్ ఏజెన్సీ సేవలు అభినందనీయం.
10 కేజీల కాంపోజిట్ డొమెస్టిక్ ఫైబర్ సిలిండర్లను పంపిణీ చేసిన ఎంపీపీ చేసిన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి.
కోదాడ,14 జూన్ 2022 తెలంగాణవార్త ప్రతినిధి : కోదాడ అంజన్ గ్యాస్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో 10 కేజీల కాంపోజిట్ డొమెస్టిక్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి 10 కేజీల ఫైబర్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి మాట్లాడుతూ సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు ఉపయుక్తంగా నూతనంగా 10 కేజీల కాంపోజిట్ డొమెస్టిక్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేద మధ్యతరగతి ప్రజలకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా సౌకర్యవంతంగా ఉంటుందని ప్రయాణానికి, ట్రాన్స్ పోర్టింగ్ కి సౌకర్యంగా ఉంటుందని గ్యాస్ లీకేజీ,
తుప్పు పట్టడం, అండర్ వెయిట్ సమస్యలాంటివి ఉండవని మహిళలు సైతం తీసుకువెళ్లేలా తక్కువ బరువుతో సేఫ్టీ ఫీచర్లు అధికంగా ఉన్నందున ప్రజలంతా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలకు ఇంత సౌకర్యవంతమైన సిలిండర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అంజన్ గ్యాస్ ఏజెన్సీ వారు చేసిన కృషి అభినందనీయమని అన్నారు.ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు సిలిండర్లను ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అంజన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ప్రముఖ జర్నలిస్ట్ అంజన్న,పట్టణ యూత్ అధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, పవన్ గౌడ్, బద్రి, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.