సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ప్రతాప్ పోతెన్ మృతి..

సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ప్రతాప్ పోతెన్ మృతి..

సీనియర్‌ నటుడు ప్రతాప్ పోతెన్ (70) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ప్రతాప్‌ తుది శ్వాస విడిచారు. మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రతాప్‌ నటి రాధిక మాజీ భర్త అనే విషయం తెలిసిందే. ప్రతాప్‌ చివరిసారి ఈ ఏడాది ప్రారంభంలో మమ్ముటీ హీరోగా తెరకెక్కి సీబీఐ5 ది బ్రెయిన్‌ సినిమాలో చివరిసారిగా నటించారు.

 మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతాప్‌ తమిళంతోపాటు తెలుగులోనూ పలు విషయవంతమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించారు.  తెలుగులో ఆయన ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గానూ మంచి దక్కించుకున్నారు. 1985లో వచ్చిన మీండుమ్‌ ఒరు కాతల్‌ కథై చిత్రానికి గాను ప్రతాప్‌ ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇక ప్రతాప్‌ పోతెన్‌ 1985లో నటీమణి రాధికను వివాహం చేసుకున్నారు. అయితే ఏడాదికే (1986) ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం అమలా సత్యనాథ్‌ను వివాహం చేసుకున్నారు. కానీ వీరు 2012లో విడిపోయారు.