సీఎం కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష

మునగాల 21 నవంబర్ 2023
తెలంగాణ వార్త ప్రతినిధి :-
*ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కి మునగాల మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు*
*అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునగాల మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కోదాడ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఆయా గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పలికారు*
*ఆయా గ్రామ ప్రజలు వీరతిలకం దిద్ది, మహిళలు మంగళహారతులతో, కోలాటాలతో, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.*
*బీఆర్ఎస్ గెలుపు కోసం గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త బీఆర్‌ఎస్ పార్టీ కోసం సైనికుల్లా పని చేయాలి.*
*కోదాడ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం*
*రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో మన అనుభవంలో ఉంది.*
*కోదాడ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది*.
*సీఎం కేసీఆర్ గారు నిరుపేదలకు కావాల్సిన వాటిని సంక్షేమ పథకాల రూపంలో అందజేస్తుండడంతో ప్రజలంతా సుఖసంతోషాలతో వుంటున్నారు*.
*రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం.*
*వ్యవసాయ రంగానికి అన్ని రకాలగా సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది*.
*రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.*
*పేదల సంక్షేమం కొనసాగాలంటే మళ్ళీ కెసిఆర్ రావాలి.*
*ప్రజల మనసులో కేసీఆర్ ఉన్నారు.
సీఎం కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని *కోదాడ శాసనసభ్యులు,బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ * అన్నారు.సోమవారం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మునగాల మండలంలోని కొక్కిరేణి, తిమ్మారెడ్డి గూడెం, గణపవరం, ముకుందాపురం, ఆకుపాముల, కోదండ రామాపురం, నరసింహపురం గ్రామాలలో *ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ * ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....... కోదాడ గడ్డ పైన మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో మన అనుభవంలో ఉంది అని ఆయన అన్నారు.దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అని ఆయన తెలిపారు.సీఎం కేసీఆర్ గారు నిరుపేదలకు కావాల్సిన వాటిని సంక్షేమ పథకాల రూపంలో అందజేస్తుండడంతో ప్రజలంతా సుఖసంతోషాలతో వుంటున్నారు అని ఆయన అన్నారు.రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం అని ఆయన అన్నారు.వ్యవసాయ రంగానికి అన్ని రకాలగా సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని ఆయన తెలిపారు.రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని ఆయన తెలిపారు.పేదల సంక్షేమం కొనసాగాలంటే మళ్ళీ కెసిఆర్ రావాలి అని ఆయన చెప్పారు.ప్రజల మనసులో కేసీఆర్ ఉన్నారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అజయ్ కుమార్, కట్ట సతీష్, మండల పార్టీ అధ్యక్షులు రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.