శివనం పల్లి గ్రామాన్ని సందర్శించిన ఇటిక్యాల ఎంపీడీవో.

శివనం పల్లి గ్రామాన్ని సందర్శించిన ఇటిక్యాల ఎంపీడీవో.

ఇటిక్యాల, 10 జూన్ 2022 తెలంగాణవార్త : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలోగల శివనం పల్లె గ్రామాన్ని సందర్శించిన ఇటిక్యాల ఎంపీడీవో రాఘవ.

ఈ సందర్భంగా ఎంపిడిఓ రాఘవ మాట్లాడుతూ మిషన్ భగీరథ నీళ్లు రోడ్లపై పారుతుంటే గ్రామస్తులకు ఇబ్బందికరంగా ఉన్నందున పంచాయతీకి సంబంధించిన ట్యాంక్ కింద ఇంకుడు గుంత తీసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని సర్పంచుకు పంచాయతీ కార్యదర్శికి సూచించారు.

మరియు ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు, తరగతి గదులను శానిటేషన్ చేసి ఈనెల 12 వ, తేదీ లోపల అందుబాటులోకి తీసుకరావాలని సంబంధితఅధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాఘవ పారిశుద్ధ్య కార్మికులు శివన్నం పల్లె సల్వా రెడ్డి పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు.