శ్రీ కృష్ణవేణి జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు కు ఫిర్యాదు చేసిన విద్యార్థి వెంకటేష్ తల్లిదండ్రులు...

ధరూర్ 3 జనవరి 2023 తెలంగాణవార్త ప్రతినిధి :- మండల పరిధిలోని గార్లపాడు గ్రామానికి చెందిన మల్లేష్ గోవిందమ్మ ల కుమారుడు వెంకటేష్ గద్వాల్ పట్టణంలోని శ్రీకృష్ణవేణి జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. విద్యార్థి వెంకటేష్ గత నెల 15న కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే... విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన గద్వాల శ్రీకృష్ణవేణి జూనియర్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని హైదరాబాద్ లోని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును తల్లిదండ్రులు ఆశ్రయించారు. కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.