వాహనాల  తనిఖీల్లో  ఏలాంటి రశీదులు లేని 2,97,400/- రూపాయలు  సీజ్

వాహనాల  తనిఖీల్లో  ఏలాంటి రశీదులు లేని 2,97,400/- రూపాయలు  సీజ్

జోగులాంబ గద్వాల 20 నవంబర్ 2023 తెలంగాణ వార్త- ప్రతినిధి:-  ఉండవెల్లి ఎన్నికల కోడ్ లో బాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల పరిధిలో, సరి హద్దు చెక్ పోస్టు లలో విస్తృతంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రితిరాజ్  తెలిపారు.సోమవారం ఉదయం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఉండవెల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలో పుల్లూరు చెక్ పోస్టు దగ్గర ఏలాంటి రశీదులు లేని 2,97,400/- రూపాయలను సీజ్ చేసి జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీకి పోలీస్ అధికారులు అప్పగించగ కమిటి విచారించి ఆ  డబ్బును తిరిగి సంబంధీకులకు కమిటీ  అప్పగించినట్లు ఎస్పీ  తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో ఎవరైన 50వేల రూపాయల కొద్దీ ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే  తగిన రశీదులు ,పత్రాలు  వాటి వివరాలు వెంట తీసుకెళ్ళాలని జిల్లా ఎస్పీ  ప్రజలకు సూచించారు...