వ్యవస్థకు విద్రోహం తలపెడుతున్నది ఎవరు.?

వ్యవస్థకు విద్రోహం తలపెడుతున్నది ఎవరు.?

 మరింత మెరుగైన  సమాజం కావాలని  కోరుకోకపోవడం కూడా అందులో భాగమే.*  ఉత్పత్తిలో భాగస్వాములు   కాని వాళ్లు,  ప్రజా సంపదను దోచే  పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులే   ప్రగతికి అడ్డుగోడలు.*  బాధ్యులకు  కర్రు కాల్చి వాత పెట్టాల్సింది ప్రజలే

రాజకీయ పరిభాషలో ఆలోచించినప్పుడు  ప్రస్తుతం ఉన్న వ్యవస్థ కంటే మరింత మెరుగైన  సమాజాన్ని కోరుకునే వాళ్ళు  రాజనీతిజ్ఞులు అని రాజకీయ శాస్త్రం చెబుతుంది.  వ్యవస్థ  మెరుగైన పరిస్థితుల్లోకి వెల్లెక్రమంలో  ఆటంకాలు  ప్రగతి నిరోధకులను గుర్తించడంతోపాటు  అంతరాలు లేని సమ సమాజం  ఆవిర్భవించాలని  కోరుకొని ఆ వైపుగా అడుగులు వేసే వాళ్లను మేధావులు బుద్ధి జీవులు అంటారు.  రాజకీయరంగం పూర్తిగా బ్రష్టు పట్టిపోయి  రాజ నీతిజ్ఞులు కనుచూపుమేరలో కనిపించకపోగా  ప్రచార ఆర్భాటాలు  ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసే దుస్థితి నుండి  ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చే  పరిస్థితికి దిగజారడం  అత్యంత దయనీయమైన విషయం . మెజారిటీ ప్రజానీకమైనటువంటి సామాన్యులను  ప్రణాళిక రూపకల్పనలో కానీ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో కానీ పరిగణనలోకి తీసుకోకపోవడం  వలన  సామాన్య ప్రజానీకం యొక్క పరిస్థితి  లో మార్పు కనిపించకపోగా  రోజురోజుకు  పేదరికం మరింత పెరిగిపోతున్నది.  సంపద కేంద్రీకరణ,  అసమానతల నిర్మూలనలో ప్రణాళికలు  ప్రభుత్వాలు అమలు చేయకపోవడం,  ఆస్తి సంపదలకు అనుకూలంగా  అధిక  పన్నులు విధించ డంతోపాటు,  పేద వర్గాలకు మాత్రమే ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా   సమానత్వ స్థాయికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది .కానీ  ఆ రకమైనటువంటి ప్రయత్నం కూడా జరగడం లేదు  కరోనా సమయములో  దేశ ఆర్థిక పరిస్థితిని  సంక్షోభం నుండి గట్టెక్కించడానికి  కేంద్ర ప్రభుత్వానికి ఐఆర్ఎస్ అధికారులు  పలు సూచనలు చేస్తూ  సంపన్న వర్గాలకు ప్రత్యేకంగా  పన్ను విధించడం ద్వారా  నిధులను రాబట్టుకొని పేద ప్రజలకు  ఆసరాగా నిలబడాలని సూచన చేసినందుకు  ఐఆర్ఎస్ అధికారులను దేశద్రోహులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తీరు మనందరికీ తెలిసినదే.  ప్రతి వ్యక్తి కూడా  దేశంలో  వ్యవస్థ మారాలని దేశం అభివృద్ధి చెందాలని  ప్రగతి పథంలో పయనించాలని  నిరంతరం  మాట్లాడుతూనే ఉంటారు. సామాన్యుల నుండి  అసమాన్యుల వరకు  పెట్టుబడిదారులు కూడా  ఇదే నినాదాన్ని ఇవ్వడం  మనం చూస్తూనే ఉన్నాం.  కానీ అభివృద్ధి చెందకపోగా  తి రోగమన స్థితిలోకి చేరడాన్ని  ఎలా చూడాల్సి ఉంటుంది .?
      ప్రగతి నిరోధకులను గుర్తించాలి-  వారి భరతం పట్టాలి,:-
*****
  సహజంగా  దేశాభివృద్ధికి అవరోధాలుగా ఉన్నటువంటి  సామాజిక ఆర్థిక రాజకీయపరమైనటువంటి రుగ్మతలను  గుర్తించి నిర్మూలించవలసిన అవసరం ఉంది  .కానీ ఆ వైపుగా ప్రభుత్వం ఏనాడు చర్యలు తీసుకోలేదు  మద్యం  ప్రజల ఆదాయాలతో పాటు ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేస్తూ కుటుంబాలను వీధిపాలు చేస్తున్నదని విషయం తెలిసినప్పటికీ  దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి నిషేధించడానికి   ప్రభుత్వాలు ధైర్యం చేయడం లేదు.  దేశంలో నాలుగైదు రాష్ట్రాలు మినహాయిస్తే  అన్ని రాష్ట్రాలలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతూ  నిషేధించిన రాష్ట్రాల  ఆలోచనకు  గండి కొడుతున్న విషయాన్ని గమనించాలి . తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి  10,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే మద్యం ద్వారా ప్రస్తుతం  45 వేల కోట్లకు చేరిందంటే  ప్రభుత్వాల ప్రమేయం లేకుండా కాదు కదా ! అలాంటి ప్రభుత్వాలను గద్దేది0 చడమే పరిష్కారంగా మనం ఆలోచించవలసి ఉంటుంది . దేశవ్యాప్తంగా  మధ్య నిషేధాన్ని అమలు చేయడానికి  ప్రధానమంత్రి ఏమాత్రం చొరవ చూపకపోవడం,  తన సొంత రాష్ట్రంలో  50 సంవత్సరాలకు పైగా నిషేధం ఉన్నప్పటికీ  రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి  నిషేధానికి సాహసం చేయకపోవడం బాధ్యత రాహిత్యమే కదా!
      ఈ దేశ ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నది  కార్మికులు ,కర్షకులు, చిరు వ్యాపారులు, చేతివృత్తుల వాళ్ళు,  కొంత వ్యాపార వర్గాలు  అయితే  ఉద్యోగస్తులు సేవా రంగంలో పనిచేస్తుండగా  పోలీసు సిపాయిలు  శాంతి భద్రతల పరిరక్షణ దేశ రక్షణలో  ఉన్నారు.  ఇక ఇప్పటికీ జనాభాలో  సగానికి పైగా  రియల్ ఎస్టేట్ ,పెట్టుబడిదారులు,  రాజకీయరంగంలో  పనిచేస్తున్న వారు,  బడా పారిశ్రామికవేత్తలు  నిజంగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించకపోగా  పైకి దేశం కోసం పనిచేసినట్లుగా నటిస్తూనే  అభివృద్ధికి గండి కొడుతున్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని ద్రోహం చేస్తున్నారు . ఉద్యోగ రంగంలోని కొంత శాతం కూడా  అవినీతిలో భాగస్వాములై  సామాన్య పేద మధ్యతరగతి  ప్రజలు రైతుల పొట్టలు కొట్టి  లంచాల రూపంలో  వ్యవస్థకు తీరని ద్రోహం చేస్తున్నారు.  ఇక రాజకీయ రంగం పూర్తిగా బ్రష్టు పట్టిపోయి అవినీతిలో కూరుకపోవడంతో పాటు  ఉత్పత్తితో ప్రమేయం లేకుండా  ప్రజల సంపదను  జలగల పిలుస్తూ  కష్టపడకుండానే  సంపదను  పోగు చేసుకోవడంతోపాటు  భూకబ్జాలు, అక్రమ దందాలు,  భూ ఆక్రమణలకు పాల్పడుతుంటే  మరింత మెరుగైన వ్యవస్థ కనుచూపుమేరలో ఎలా సాధ్యమవుతుంది ? గత పది ఏళ్లలో  కేంద్ర ప్రభుత్వం  ప్రభుత్వ బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నటువంటి  పెట్టుబడిదారులకు   14 లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తుంటే  సామాన్యుడు తన శ్రమను నమ్ముకుని  చెమట వడిసి ఉత్పత్తిలో భాగస్వామిగా  పంటలు, నిర్మాణ,  సేవా రంగాలలో కృషి చేస్తూ చాలీచాలని జీవితాన్ని అనుభవిస్తూ  వ్యవస్థ చేత చీత్క రించబడుతున్న విషయం మనందరం చూస్తూనే ఉన్నాం.  ఉత్పత్తిలో నిమగ్నమైన వారికి మాత్రమే జీవించే హక్కు ఉంటుంది  పీడించే వారికి,  ద్రోహం చేసే వారికి,  అక్రమంగా దేశ సంపదను ప్రజల ఆస్తిపాస్తులను చిన్నాభిన్నం చేసే వర్గాలకు  కూడా  రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన జీవించే హక్కును కల్పించడం నిజంగా  సిగ్గు చేటు.     దేశంలోని సంపన్న వర్గాలలో  top  10 కుటుంబాల యొక్క సంపదను  దేశ ప్రజలందరికీ  25 సంవత్సరాల పాటు ఉచిత విద్య వైద్యం ఇతర సౌకర్యాలకు  కేటాయించవచ్చునని  ఆక్స్ఫామ్    ఇండియా వంటి నివేదికలు తెలియజేస్తుంటే,  ఆదేశిక సూత్రాలు కూడా సంపద కొద్ది మంది చేతుల్లో పోగు పడకూడదని ఆదేశిస్తుంటే  దేశ పరిస్థితులు ఎంత  రాజ్యాంగ విరుద్ధంగా తయారైనవో అర్థం చేసుకోవచ్చు.!  రాజ్యాంగ ప్రవేశికలోనూ  ప్రాథమిక హక్కుల్లోనూ  సామ్యవాదం సమానత్వం అని గర్వంగా చెప్పుకుంటున్న మనం  పాలకవర్గాలు గత 75 సంవత్సరాలుగా  సమానత్వ సాధన కోసం  ,పేద ప్రజలను  ఉన్నత స్థాయికి తీసుకురావడానికి  చేసిన ప్రయత్నాలు నామ మాత్రం కాగా  సంపన్న వర్గాలను మరింత సంపన్న వర్గాలుగా  తీర్చిదిద్దడంలో మాత్రం పెట్టుబడిదారులకు వ0త పాడుతున్న ప్రభుత్వాల తీరును  ఇప్పటికీ సామాన్య ప్రజలు గుర్తించి  కర్రు కాల్చి వాత పెట్టకపోతే  ఈ అసమానతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నది.
       ఇక ఇప్పటికీ    విద్యావంతులు,   ఉద్యోగులు,  వ్యాపార సంపన్న  వర్గాలు   మాత్రం  ఈ వ్యవస్థ మార్పు పట్ల ఏనాడు కూడా శ్రద్ధ చూపిన దాఖలా లేదు . ఎంతసేపు తమ కుటుంబాలు,  తమ పిల్లలు,  ఉద్యోగాలు, ఆస్తిపాస్తులు పెంచుకోవడంలో చూపిన శ్రద్ధ  సామాజిక స్పృహతో వ్యవస్థ మార్పుకు కృషి చేయని కారణంగా  కనీసం  మరింత మెరుగైన వ్యవస్థ ఏర్పడాలని  ఏనాడు కోరుకోని వీరిని    సంఘ వ్యతిరేక శక్తులు,  ప్రగతి నిరోధకులుగా  గుర్తించవలసివుంటుంది. బడా పెట్టుబడిదారులు ఒకవైపు,  రాజకీయ నాయకుల్లో ఎక్కువ మొత్తం,  విద్యావంతులు ఉద్యోగులు,  ఇతర వర్గాలు కూడా  సామాజిక మార్పుకు ఏనాడు తోడ్పడని కారణంగా  కూడా భారత వ్యవస్థ ఉచ్చ స్థితికి చేరుకోవడం లేదు.  ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశం గానే మిగిలిపోతే  అనేక  సూచికలలో కూడా ప్రపంచ దేశాలలో  వెనుకబడిన స్థితిలో ఉండడాన్ని మనం గమనించవచ్చు.  పాలకుల పుణ్యమా అని   పత్రికా స్వేచ్ఛ లో  ప్రపంచంలో 180 దేశాల్లో మనం 150వ స్థితిలో ఉన్నామంటే  ఎంత దుర్గతిలో ఉన్నాము అర్థం చేసుకోవచ్చు. 
     ప్రగతి నిరోధకులు , అభివృద్ధికి ద్రోహం చేసే వాళ్ళు,  సంఘ విద్రోహశక్తులు,  ఉత్పత్తికి దూరంగా ఉన్నవాళ్లు,  అభివృద్ధిని కనీసం ఆకాంక్షించని వాళ్ళు  దేశద్రోహులుగా మిగిలిపోయిన తరుణంలో  చెమట చిందించే వాళ్లు  ఇక ఏమాత్రం కూడా భరించవలసిన అవసరం లేదు.  నేరేస్తులను గుర్తించినప్పుడు  శిక్షలు పడాల్సిందే  కానీ  ప్రభుత్వము  న్యాయ వ్యవస్థ వీరికి శిక్షలు వేసే అవకాశం కనుచూపుమేరలో లేదు కనుక  ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు ఉమ్మడిగా ఉద్యమ శక్తులుగా  ప్రజా పోరాటాన్ని విస్తృతం చేయడంతో పాటు ఎన్నికలలో  తమ శక్తిని ప్రదర్శించి  తమ ఆకాంక్షలతో పార్టీలను హెచ్చరించి  భిన్నంగా నడుచుకుంటే తగిన మూల్యం చెల్లించవలసింది అని  శరత్ విధించడం ద్వారా  స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మాత్రం  ఉన్నది . ఇప్పటికే సమయం మించిపోయినది.  మేధావులు బుద్ధి జీవులు కూడా  ప్రజా ఉద్యమాలను నడిపిస్తూ  ప్రజా చైతన్యంలో పాలుపంచుకోవడం ద్వారా  క్రియాశీల భూమిక పోషిస్తేనే  మెరుగైన భారతదేశ వ్యవస్థ ఆవిర్భవిస్తుంది.  అంతరాలు, అసమానతలు, దోపిడీ, పీడన, వంచన  లేనటువంటి  సమ సమాజ స్థాపన మన ఆకాంక్షగా  నినది0చ చవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉన్నది  ఎన్నికల వేళ  ఈ బాధ్యత  మరింత ఎక్కువ .

--వడ్డేపల్లి మల్లేశం 
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)