విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి-పీ. డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు పోలేబొయిన కిరణ్

సూర్యపేట, 29 జూన్ 2022 తెలంగాణవార్త ప్రతినిధి : సూర్యపేట జిల్లా కేంద్రంలో బీసీ హాస్టల్ లో  ఏర్పాటు చేసినా సమావేశంలో  పీ.డి.ఎస్.యు సూర్యపేట జిల్లా అధ్యక్షుడు పోలేబొయిన కిరణ్ విద్య రంగ సమస్యలను ప్రభుత్వ పరిష్కరించాలిని అని అన్నారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సం రాలు గడుస్తున్నా నేటికి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందింది అని అన్నారు. ప్రభుత్వ  విద్యాసంస్థలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్న ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు నేటికీ  పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లు అందించకుండా పేద బడుగు బలహీన విద్యార్థులను చదువు దూరం చేస్తుంది అని అన్నారు.

  ఒకవైపు ప్రవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలు లక్షల రూపాయలు ఫీజుల దోపిడీ చేస్తూ పాఠ్యపుస్తకాల , వివిధ రకాల పేర్లతో వేల రూపాయలు వసూలు చేస్తున్నా ప్రభుత్వ, విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పైగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ,ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సిన అవసరం ఉండగా విడుదల చేయకపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు ఫీజులు కడితేనే విద్యార్థుల సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఫీజులు కట్టలేక పై చదువులు చదవలేక అనేకమంది విద్యార్థులు చదువులు మధ్యలోనే వదిలేస్తున్నారు.

 హాస్టల్ లో చదివే విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ ఛార్జీలు, మెస్ చార్జీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వ పెంచక పోగా  ఉన్నటువంటి హాస్టల్ ని కూడా కోచింగ్ సెంటర్ల పేరుతో లాక్కొని రెండు మూడు హాస్టలా విద్యార్థుల్ని ఒకే హాస్టల్లో పెట్టి  విద్యార్థులను  ఇబ్బందులకు గురి చేస్తున్నారుఅని అన్నారు .తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి ,ప్రైవేట్ ,కార్పొరేటు  విద్యా సంస్థలలో  ఫీజుల దోపిడిని అరికట్టి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయిమెంట్ విడుదల చేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్, చార్జీలు మెస్ చార్జీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీ. డి.ఎస్.యు డివిజన్ అధ్యక్షుడు నారగాని లింగస్వామి,  ప్రశాంత్,  మనోజ్, జగదీశ్, సాయి గణేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.