వీఆర్ఏల అరెస్టులను ఖండించండి......

సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి.            

వీఆర్ఏల అరెస్టులను ఖండించండి......

గద్వాల,  21 మే 2022 తెలంగాణవార్త ప్రతినిధి :  ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పే స్కేలు ఇవ్వాలని వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తదితర డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చలో సిసిఎల్ఎ కార్యక్రమం చేపట్టగా హైదరాబాద్ కు వెళ్లకుండా పోలీసులు వీఆర్ఏల అందరినీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం దుర్మార్గమని సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకట స్వామి అన్నారు.  వీఆర్ఏల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

  ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వీఆర్ఏల పట్ల ముఖ్యమంత్రి అలాగే చీఫ్ సెక్రటరీ నిర్లక్ష్యం చేస్తున్నారని రెవెన్యూ వ్యవస్థ లో కీలకంగా వ్యవహరిస్తున్న వీఆర్ఏల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి పనికిరాదని వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన విఆర్ఏ లను గద్వాల రూరల్ మరియు టౌన్ పోలీస్ స్టేషన్ లో  సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకట స్వామి పరామర్శించారు. అరెస్టు అయిన వారిలో వీఆర్ఏల సంఘం గద్వాల మండల అధ్యక్షులు కే మహేష్, గోవర్ధన్, ఎం వెంకటేష్, ఉప్పు రాము, శ్రీనివాసులు, వెంకటేష్, సత్యన్న, వీరన్న, సుధాకర్, పరశురాముడు, దేవమ్మ, తదితరులు ఉన్నారు.