లింగన్న.. వెళ్ళొస్తాం.. ముగిసిన పెద్దగట్టు జాతర

- ముందస్తు ప్రణాళికలతో జాతర విజయవంతం

లింగన్న.. వెళ్ళొస్తాం..  ముగిసిన పెద్దగట్టు జాతర
లింగన్న.. వెళ్ళొస్తాం..  ముగిసిన పెద్దగట్టు జాతర
లింగన్న.. వెళ్ళొస్తాం..  ముగిసిన పెద్దగట్టు జాతర
లింగన్న.. వెళ్ళొస్తాం..  ముగిసిన పెద్దగట్టు జాతర
లింగన్న.. వెళ్ళొస్తాం..  ముగిసిన పెద్దగట్టు జాతర
లింగన్న.. వెళ్ళొస్తాం..  ముగిసిన పెద్దగట్టు జాతర

సూర్యాపేట:- గత ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర ఐదవ రోజు గురువారం ముగిసింది. చివరి రోజు కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. సాయంత్రం వరకు  భక్తులు  రాగా అనంతరం జన ప్రవాహం కొనసాగింది. ఆలయానికి అలంకరించిన మకర తోరణాన్ని అర్ధరాత్రి బేరి చప్పుళ్ల మధ్య సూర్యాపేటలోని గోల్ల బజారుకు తరలించి బలి పూజ నిర్వహించారు. చివరి రోజు కూడా పలువురు ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్  సలహాలు సూచనలతో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ముందస్తు ప్రణాళికలను రూపొందించి జాతరను విజయవంతం చేశారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యం పర్యవేక్షిస్తూ  సహాయక చర్యలు చేపడుతూ భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నారు. జాతరను విజయ వంతం చేసి అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందించారు.