రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరిన

ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి 

రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరిన

 మంగపేట... తెలంగాణ వార్త :- ఈ రోజు మంగపేట మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ నూతన పార్టీ ఆఫీస్ లో మండల పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి  ఆధ్వర్యంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిధిగా ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి గారు విచ్చేసి రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.     ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నల్లేలా కుమారన్న గారు మాట్లాడుతూ దేశంలోని రాబంధుల పాలన అంతమొందించి, ప్రజలకు సుపరిపాలన అందించడానికి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు దేశంలోని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర సెప్టెంబర్ 7 నుండి జోడో యాత్రను ప్రారంభించి అక్టోబర్ 23న తెలంగాణ రాష్ట్రానికి విచేస్తున్న శుభ సందర్భముగా కార్యకర్తలందరు జోడో యాత్రకు భారీగా హాజరయి రాహుల్ గాంధీ గారికి ఘన స్వాగతం పలికి, పాదయాత్రని విజయవంతం చేయాలని కోరారు.

 అలాగే దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, అధికార పార్టీల అవినీతి, అక్రమాలను బయటపెడుతూ, ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా మారి, కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా తన అడుగును ప్రారంభించారు అని అన్నారు. రాహుల్ గాంధీ గారి అడుగులకు మన అడుగులు జత చేసి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలమేంటో నిరూపించి రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకే అధికారాన్ని అందించేలా కృషి చేయాలని అన్నారు. ములుగు జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని దానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే సీతక్క  శ్రమ అని, క్షణం తీరిక లేకుండా గడుపుతూ, కాంగ్రెస్ పార్టీని జిల్లాలో దృఢంగా ఉండేలా చేసిందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు, కీర్తిని సాధించిన సీతక్క  మనందరికీ ఆదర్శం అని, సీతక్క గారిలా మనమందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. అలాగే అక్టోబర్ 23 ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయుచున్న రాహుల్ గాంధీ గారికి ఘన స్వాగతం పలుకుతూ, జోడో యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు.

    ఈ కార్యక్రమంలో  కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ యూత్ జిల్లా అధ్యక్షులు బాణోత్ రవిచందర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆక రాధాకృష్ణ  జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్ బాబు కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు జిల్లా నాయకులు మండల నాయకులు అనుబంధ సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు......*