రుణాలు అందించుటలో బ్యాంకులు ముందుండాలి.

రుణ లబ్దిదారులకు మెరుగైన సేవాలందించాలి. అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.

రుణాలు అందించుటలో బ్యాంకులు ముందుండాలి.
రుణాలు అందించుటలో బ్యాంకులు ముందుండాలి.

రుణాలు అందించుటలో బ్యాంకులు ముందుండాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. డిజిటల్ మార్పుకు అనుగుణంగా బ్యాంకులు సేవలందించేందుకు ప్రత్యేక కృషి చేయాలని అన్నారు. మహిళలు బ్యాంకు రుణాలతో జీవన ప్రమాణాలు మెరుగు పర్చుకోనెలా ఎక్కువ రుణాలు అందించాలని సూచించారు. రుణమేళ కార్యాక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ మార్పుకు అనుగుణంగా బ్యాంకులు కస్టమర్లకు మెరుగైన సేవలందించాలని, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై బ్యాంకర్లు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు.  స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు మంజూరు చేసే రుణాలను  తమ అప్పులు తీర్చుకోవడానికి వాడకుండా జీవనప్రమాణాలు మెరుగుపరచుకునే కార్యక్రమాలకు ఉపయోగించాలని సూచించారు. బుదవారం జిల్లా కేంద్రంలో ఆజాద్ అమృత్ మహోత్సవ్ కార్యాక్రమంలో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంక్ ఆద్వర్యంలో  ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఋణ విస్తరణ కార్యాక్రమంలో ఆయన ముఖ్య అతిదిగా పాల్గొన్నారు.

 ఈ సందర్బంగా పలు బ్యాంకులు మంజూరు చేసిన ఋణ పత్రాలను లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ యూ. విజయ్ భాస్కర్ తో కలిసి  వినియోగదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి, జీవన ప్రమాణాల మెరుగు కోసం యువత పాత పథకాలపైనే ఆధారపడకుండా కొత్త కార్యక్రమాలను గుర్తించాలని, కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని తెలిపారు. ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేయాలని, వారి జీవనప్రమాణాలను మెరుగుపరచేందుకు కొత్త అంశాలతో ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చెప్పారు. భవిష్యత్‌ ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని బ్యాంకర్లు రుణాలపై అవగాహన  కల్పించవలసిన అవసరం ఉందని అన్నారు.

 ఈ కార్యాక్రమంలో ఎస్‌బి‌ఐ రీజినల్ మేనేజర్ టి.కృష్ణ మోహన్, ఎల్‌హెచ్‌ఓ ఏజిర‌ఎం శ్రీధర్ బాపూజీ, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల శాఖ జి‌ఎం తిరుపతయ్య, వివిద బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.