రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తెలంగాణ వార్త, అక్టోబర్ 4 : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు.మందాయి పల్లి గ్రామానికి చెందిన తాడం ఆంజనేయులు (40) టీఎస్ 08 జేజీ 5362 నంబరు గల యాక్టివా వాహనం పై తూంకుంట నుంచి పోతాయిపల్లి గ్రామానికి వెళ్తున్నాడు. అదే మార్గంలో పోతాయిపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్ (31) టీఎస్ 10 సీఏటీఆర్ 0227 నంబర్ గల బొలెరో వాహనాన్ని అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న తాడెం ఆంజనేయలు వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదం లో ఆంజనేయులు తలకి బలమైన రక్తగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.