యువత స్వశక్తితో ఎదగాలి

అమ్మ రైస్ షాపును ప్రారంభించిన డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్

యువత స్వశక్తితో ఎదగాలి

సూర్యాపేట : యువత స్వశక్తితో ఎదగాలని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 42 వ వార్డులో అమ్మ రైస్ షాప్ ను దుకాణాన్ని ప్రారంభించి మాట్లాడారు. యువత ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని స్వశక్తితో వాటిని సాధించేలా కష్టపడాలన్నారు. నేటి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు . అవకాశాలను సృష్టించుకుంటూ స్వయం ఉపాధి పొందేలా వ్యాపారాలు ప్రారంభించడం అభినందనీయం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం వ్యాపార కూడలిగా రూపాంతరం చెందుతుందన్నారు . నాణ్యత ప్రమాలను పాటిస్తూ ప్రజల మన్నలను పొందాలన్నారు. కార్యక్రమంలో అమ్మ రైస్ డిపో నిర్వాహకులు జక్కలి స్వరూప నాగరాజు, పెరుగు లావణ్య లింగయ్య, పాండురంగ చారి ,జక్కలి గోపి, తగుల జనార్ధన్, బుడగ మల్లేష్ యాదవ్, పాషా,ఉపేందర్, లింగరాజు, జనార్ధన్, సరేష్ తదితరులు పాల్గొన్నారు.