యల్ పి జి మహాలక్ష్మి పథకాన్ని లబ్ధిదారులకు అందించిన జూపల్లి అనుచరులు.

Oct 11, 2024 - 21:32
Oct 11, 2024 - 21:34
 0  4
యల్ పి జి మహాలక్ష్మి పథకాన్ని లబ్ధిదారులకు అందించిన జూపల్లి అనుచరులు.

11-10-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం  గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం  6 గ్యారంటీ పథకాలలో ఒకటైన 500 రూపాయలకే యల్. పి. జి సిలిండర్ ను  అందించాలని లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది.  గూడెం గ్రామంలో  మంత్రి జూపల్లి గారి అనుచరులు గూడెం  గ్రామానికి  చెందిన 236 మంది లబ్ధిదారులను, గుర్తించిఎంపిక చేయడం జరిగింది.  తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన  మహిళలకు గూడెం గ్రామ జూపల్లి ని నమ్మిన బంటులు, జూపల్లి అనుచరులు, జూపల్లి సన్నిహితులు, జూపల్లి కార్యకర్తలు, అందరూ కలిసి గూడెం గ్రామపంచాయతీ దగ్గర  పత్రాలను అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ, మరియు క్యాథూరి రాముడు, కుమ్మరి బుచ్చన్న, అవ్వల్ల వెంకటస్వామి, వెంకటేశ్వరరావు, బత్తుల నారాయణ, వెలుమ రాజు, పెద్ద నరసింహ, క్యాతూరి అయ్యన్న, పెద్ద గలైన్న, అంబయ్యల కురుమయ్య తదితరులు పాల్గొని తెలంగాణ ప్రభుత్వ అభయహస్త కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333