మహిళ మృతి

జోగులాంబ గద్వాల 13 అక్టోబర్ 2023 తెలంగాణవార్త ప్రతినిధి:-మండలం పరిధిలోని ఇరుకు చెడు గ్రామంలోని ఒక మహిళ మృతి చెందడం జరిగింది.. ఇంకా పూర్తి వివరాలకు వెళ్తే ఆమె పేరు కురువ పవిత్ర వైఫ్ ఆఫ్ నాగేష్ ఆమె వయసు 22 సంవత్సరములు ఆమెకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకి ఇద్దరు పిల్లలు ఆమె పుట్టినిల్లు మల్లాపురం గ్రామం ధరూర్ మండలం ఆమె తల్లిదండ్రులు భర్తే చంపి ఉంటాడని అనుమానిస్తున్నట్లు సమాచారం అని కేటి దొడ్డి ఎస్సై వెంకటేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆమె తల్లిదండ్రులు పిటిషన్ మేరకు దర్యాప్తు చేసి నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.