మన ఊరు మన బడి నిర్మాణ  పనులను మార్చి చివరి నాటికీ పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

మన ఊరు మన బడి నిర్మాణ  పనులను మార్చి చివరి నాటికీ పూర్తి చేయాలి
సంబందిత  అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్.

జోగులాంబ గద్వాల 26 ఫిబ్రవరి 2023 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల:మన ఊరు, మన బడి కార్యక్రమం క్రింద ఎంపికైన  పాఠశాలలో ఉపాది హామీ పథకం కింద చేపట్టిన  సబ్ సెంటర్ల నిర్మాణ  పనులను మార్చి చివరి నాటికీ పూర్తి చేసి ప్రారంబోత్సవానికి సిద్దం చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబందిత  అధికారులకు  ఆదేశించారు.

  శనివారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు పంచాయతి రాజ్. డి ఇ లు ,ఎ ఇ లు  లతో  సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు మన ఊరు, మనబడి కార్యక్రమం ద్వారా సూచించిన పనులను  త్వరిత గతిన పూర్తి చేయుటకు  చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ పథకం క్రింద 161 పాఠశాలలో టాయిలెట్లు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన 24 పాఠశాలలకు గాను మూడు ప్రారంబిచుకున్నామని, ఇంకా 5 పాఠశాలలు ప్రారంబానికి సిద్దంగా ఉన్నాయని, మిగిలిన వాటిలో పనులు పూర్తి చేయాలనీ, మన ఊరు, మనబడి  కార్యక్రమం క్రింద జిల్లాలో ఎంపికైన పాఠశాలలలో మరుగుదొడ్లు  నిర్మాణము, అదనపు గదులు, త్రాగు నీరు, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాల్, కలరింగ్  పనులు అన్నింటిని పూర్తి చేసి ప్రారంబానికి సిద్దం చేయాలనీ అధికారులకు ఆదేశించారు, పాఠశాలలలో మొక్కలు నాటించాలని, పెయింటింగ్, పాత్ వే  పనులు త్వరగా పూర్తి అయ్యే విధంగా చూడాలని అన్నారు.

 స్కూల్ వారిగా పనులు పూర్తి  చేసి ఆన్లైన్ రికార్డు నమోదు చేయాలన్నారు. మండలం వారిగా పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ ఆర్ ఇ జి  ఎస్ కంపోనేన్స్ మొదలు పెట్టాలని, పనులు పూర్తి అయి న వాటికీ ఎఫ్ టి ఓ  సబ్మిట్ చేయాలనీ, మన ఊరు మన బడి  క్రింద ఇంకా మొదలు పెట్టని నిర్మాణ పనులు  కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, టైలెట్స్  నిర్మాణ పనులు మొదలు పెట్టి వాటికీ సమంధించిన  పొటోలు పంపించాలని ఏ ఇ లకు ఆదేశించారు.

  జిల్లా లో పల్లె దావఖాన నిర్మాణ పనులు, సబ్ సెంటర్ వారిగానిర్మాణము పనులు  పూర్తి చేయాలనీ, ఇసుక సమస్య లేకుండా చూడాలని, కూలీల సమీకరణ ఉండాలని, నర్సరీ లలో మొక్కలకు  నీళ్లు పెట్టడం  చేస్తునారా లేదా  పర్యవేక్షణ ఉండాలని అన్నారు.   ఆదార్ నమోదు లో పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేయిo చాలని  అధికారులకు ఆదేశించారు.

    సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శశికళ, అసిస్టెంట్ డి ఆర్ డి ఏ నాగేంద్రం  పంచాయతి రాజ్ ఇంచార్జి ఇ ఇ  ఆంజనేయులు, డి ఇ  సలీం, ఏ ఇ లు   సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.